కారేపల్లి, జూలై 25 : పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని పాము కాటుకు గురైన సంఘటన శనివారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో చోటుచేసుకుంది. బాలిక మండల పరిధిలోని వీరుపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో బాలిక రెండవ తరగతి చదువుతోంది. పాఠశాలకు వెళ్లిన తర్వాత తనను ఏదో కరిచిందని వంట నిర్వాహకురాలికి తెలిపింది. దీంతో వంట మనిషి ఉపాధ్యాయులకు తెలుపగా వారు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు ఆ బాలికను వెంటనే కారేపల్లి ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రికి తీసుకువెళ్లగా ప్రథమ చికిత్స తర్వాత ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.