పార్కులో బాలికపై సామూహిక లైంగికదాడి
దేశ రాజధాని నడిబొడ్డున సభ్య సమా జం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. బీజేపీ పాలిత ఢిల్లీలోని ఫరీదాబాద్‌లో ఓ బాలికపై సామూహిక లైంగిక దాడి జరగడం సంచలనం రేపుతున్నది.
- చట్టాలు, సెక్షన్లు చెప్తూ పోలీసుల్లా ప్రవర్తించిన దుండగులు
- బాలిక స్నేహితుడిని బంధించి దాడి
న్యూఢిల్లీ : దేశ రాజధాని నడిబొడ్డున సభ్య సమాజం తలదించుకునే ఘటన చోటుచేసుకుంది. బీజేపీ పాలిత ఢిల్లీలోని ఫరీదాబాద్‌లో ఓ బాలికపై సామూహిక లైంగిక దాడి జరగడం సంచలనం రేపుతున్నది. సదర్న్ రేంజ్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఫరీదాబాద్‌కు చెందిన 17 ఏండ్ల బాలిక.. తన మైనర్ స్నేహితుడితో కలిసి ఆదివారం సాయంత్రం కాల్కాజి ఆలయానికి వెళ్లింది. అనంతరం ఇద్దరూ కలిసి సమీపంలోని ఆస్తాకుంజ్ పార్క్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. అక్కడకు వచ్చిన ముగ్గురు.. పోలీసుల మాదిరిగా ప్రవర్తించారు.
అనంతరం నిందితులలో ఇద్దరు బాలుడిని బంధించగా.. ఆసిఫ్ అనే వ్యక్తి తుపాకీతో బాలికను బెదిరించి లైంగికదాడి చేశాడు. ఆ తర్వాత మిగతా ఇద్దరు కూడా ఒకరి తర్వాత ఒకరు బాలికపై లైంగికదాడి చేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసిఫ్‌ను అదుపులోకి తీసుకునే సమయంలో.. అతను పోలీసుల మీదకు మూడు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరపగా అసిఫ్ కాలికి గాయం అయింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఒకే నెలలో మూడు లైంగిక దాడి కేసులు
బీజేపీ పాలిత ఢిల్లీలో లైంగికదాడి కేసులు, వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఈ నెలలోనే మూడు మైనర్ లైంగికదాడి కేసులు నమోదయ్యాయి. సెప్టెంబర్ 12న స్వరూప్ నగర్లో 14 ఏండ్ల బాలికపై సామూహిక లైంగికదాడి పాటు హత్య కూడా జరిగింది. 16న సదార్ బజార్లో పదేండ్ల బాలికపై లైంగికదాడి ఘటన సంచలనం రేపింది. ఇప్పుడు ఫరిదాబాద్ ఘటనపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ హయాంలో బాలికలు, అమ్మాయిలకు రక్షణ లేకుండా పోయిందని ఆప్ విమర్శించింది.
బీహార్ నిందితుడిపై కాల్పులు..
బీహార్‌లోని జుమాయి నగరంలో పదో తరగతి అమ్మాయిని కొందరు జులాయిలు వేధించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ వీడియోలో ఎరుపు రంగు స్కార్ఫ్ ధరించిన వ్యక్తిని ప్రధాన నిందితుడు నందన్ యాదవ్ గా పోలీసులు గుర్తించారు. మార్వా హిల్ ప్రాంతంలో దాక్కున్నాడని.. అరెస్ట్ చేయడానికి వెళ్లగా పోలీసులను చూసి అతను పారిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అతనిపై కాల్పులు జరపగా గాయపడ్డాడు. చికిత్స చేయించిన తర్వాత అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్ట్ చేయగా.. అందులో ఇద్దరు మైనర్లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
ఒడిశాలో యువ జంటపై అల్లరి మూక దౌర్జన్యం
ఒక బాలుడు, బాలికను బీహార్‌లో కొందరు దుండగులు లైంగికంగా వేధించిన ఘటన మరువక ముందే అలాంటిదే మరొకటి ఇప్పుడు బీజేపీ పాలిత ఒడిశాలో చోటుచేసుకుంది. ధెంకనల్ జిల్లాలో ఒక గుంపు ఒక యువ జంటపై దౌర్జన్యం చేసిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నది. ప్రముఖ పర్యాటక ప్రదేశమైన కపిలాశ్ వైపు ఈ యువజంట బైక్‌పై వెళ్తుండగా కొందరు వ్యక్తులు వీరిని ఆపారు.
కొంతమంది ఆ యువకుడిపై దౌర్జన్యం చేయగా, మరికొందరు ఆ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. తమను వదిలిపెట్టాలంటూ ఆ యువతి ఎంత అరచి మొత్తుకున్నా వారు వినకుండా తమ దౌర్జన్యకాండను కొనసాగించారు. అయితే వారు ఆ జంటపై ఎందుకు దౌర్జన్యం చేశారు? వారు అంతకుముందే ఒకరికొకరు తెలుసా? అన్న విషయం తెలియరాలేదు. దౌర్జన్యానికి పాల్పడిన కొందరిని గుర్తించామని, గోండియా బ్లాక్ పోలీస్ ఇన్స్పెక్టర్ తెలిపారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

