Manne krishank | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నీట్ స్కాంపై యువతకు మద్దతుగా నిరసన చేస్తే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కలిసి ఆయనను టార్గెట్ చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నీట్ ఇష్యూ జరుగుతుంటే బండి సంజయ్, రేవంత్ రెడ్డి టాపిక్‌ను కేటీఆర్ మీదకు డైవర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.
న్యాయం కోసం పోరాటం చేస్తున్న యువతను బీజేపీ వాళ్లు తీవ్రవాదులు, విదేశీ ఫండింగ్ వస్తుందని అంటున్నారు. ఒక తండ్రిగా కేటీఆర్ ఆ యువతకు మద్దతుగా నిలిచారు.. ఆయన చేసిన తప్పేంటి..? అని ప్రశ్నించారు. కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ బండి సంజయ్, రేవంత్ రెడ్డి ప్రెస్మీట్లు పెట్టి తలతోక లేకుండా ఆరోపణలు చేస్తున్నారు. ఎవరు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా కేటీఆర్ పేరు తీసి ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. నీట్ ఉద్యమం జరుగుతుంటే దాన్ని డైవర్ట్ చేయడానికి బండి సంజయ్, రేవంత్ రెడ్డి కలిసి కేటీఆర్‌ని టార్గెట్ చేశారని మన్నె క్రిశాంక్ విమర్శించారు.
బండి సంజయ్ కొడుకుకు 9 రోజులు ప్రొటెక్షన్..
బండి సంజయ్, రేవంత్ రెడ్డి మంచి మిత్రులు.. బండి సంజయ్ కొడుకును పోక్సో కేసులో వెంటనే పట్టుకోకుండా రేవంత్ రెడ్డి 9 రోజులు ప్రొటెక్షన్ ఇచ్చాడు.. ఇప్పుడు బెయిల్ కూడా వచ్చిందని మన్నె క్రిశాంక్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నీట్ పేపర్ లీక్ నిరసనలు కాకుండా కేటీఆర్‌ను బద్నాం చేయాలని బండి సంజయ్, రేవంత్ రెడ్డి ప్రెస్మీట్లు పెడుతున్నారు. గత ప్రభుత్వంలో గ్రూప్-1 పేపర్ లీక్ అయితే ఆ ప్రభుత్వమే గుర్తించి, లీక్ చేసిన వారిని పట్టుకొని కేసు ఫైల్ చేసి జైలుకు పంపింది..కానీ సంబంధం లేకపోయినా 7 సంవత్సరాల నుంచి ఒకటే అబద్ధాన్ని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కలిసి నిస్సిగ్గుగా చెబుతున్నారని మన్నె క్రిశాంక్ మండిపడ్డారు.
గ్లోబరీనా కేటీఆర్ బినామీకి చెందిందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జేఎన్టీయూ కాకినాడనే గ్లోబరీనా సంస్థకు కాంట్రాక్టులు ఇచ్చింది. కేటీఆర్ బినామీ సంస్థ అయితే గ్లోబరీనా సంస్థకు కాంట్రాక్టులు ఎందుకు ఇచ్చారు..? అని మన్నె క్రిశాంక్ అడిగారు.
2012లో కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ సమ్మిట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ కార్యక్రమానికి గ్లోబరీనా సంస్థనే స్పాన్సర్ చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుండే గ్లోబరీనాతో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధాలు ఉన్నాయి. బీజేపీ మాజీ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గ్లోబరీనా సంస్థకు గతంలో అవార్డు కూడా ఇచ్చారు. ఈ సంస్థ ద్వారా దేశంలో ఎన్నో కాంట్రాక్టులు చేస్తున్నారన్నారు.
నీట్ ఇష్యూ జరుగుతుంటే టాపిక్ కేటీఆర్ మీదకు డైవర్ట్ చేస్తున్నారు
గ్లోబరీనా కేటీఆర్ బినామీకి చెందిందని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు
2013లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జేఎన్టీయూ కాకినాడనే గ్లోబరీనా సంస్థకు కాంట్రాక్టులు ఇచ్చింది
కేటీఆర్ బినామీ సంస్థ అయితే గ్లోబరీనా సంస్థకు… https://t.co/ZEfqXdvNLC pic.twitter.com/0BpIJc2ZPE
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2026
బండి సంజయ్, రేవంత్ రెడ్డి మంచి మిత్రులు
బండి సంజయ్ కొడుకును పోక్సో కేసులో వెంటనే పట్టుకోకుండా రేవంత్ రెడ్డి 9 రోజులు ప్రొటెక్షన్ ఇచ్చాడు.. ఇప్పుడు బెయిల్ కూడా వచ్చింది
తెలంగాణ రాష్ట్రంలో నీట్ పేపర్ లీక్ నిరసనలు కాకుండా కేటీఆర్‌ను బద్నాం చేయాలని బండి సంజయ్, రేవంత్ రెడ్డి ప్రెస్… https://t.co/VErsFkoXnQ pic.twitter.com/ABcLgv9ADz
— Telugu Scribe (@TeluguScribe) July 25, 2026