దసరా, దీపావళికి ప్రత్యేక రైళ్లు
హైదరాబాద్,సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): దసరా, దీపావళి పండగల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతున్నది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
సికింద్రాబాద్-కాకినాడ మధ్య అక్టోబర్ 7 నుంచి నవంబర్ 25 వరకు రైలును నడుపనుంది. జల్నా-యలహంక మధ్య నడుస్తున్న ప్రత్యేక రైలును అక్టోబర్ 4 నుంచి నవంబర్ 25 వరకు పొడిగించింది. ప్రయాణికులు వినియోగించు కోవాలని కోరింది.