MrBeast | ప్రపంచ నెంబర్ 1 యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ (జిమ్మీ డోనాల్డ్సన్) తన భార్య థియా బూయ్సన్తో కలిసి భారతదేశంలోని ప్రసిద్ధ చారిత్రక కట్టడమైన ఆగ్రా తాజ్ మహల్‌ను సందర్శించారు. ఈ డిజిటల్ స్టార్ దంపతుల రాకతో ఆగ్రాలో ఒక్కసారిగా సందడి వాతావరణం నెలకొంది. తూర్పు గేట్ గుండా లోపలికి వెళ్లిన ఈ జంట.. తాజ్ మహల్ మొఘల్ వాస్తుశిల్పాన్ని, పాలరాతి నగిషీలను ఎంతో ఆసక్తిగా తిలకించారు. పురావస్తు నిపుణుల (Archaeological Survey of India) సిబ్బందిని అడిగి కట్టడ విశేషాలను తెలుసుకుంటూ ఫొటోలు దిగారు.
ఇక మిస్టర్ బీస్ట్ వచ్చారనే విషయం తెలుసుకున్న పర్యాటకులు, ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. సెల్ఫీల కోసం జనం ఎగబడటంతో స్వల్ప తొక్కిసలాట వాతావరణం ఏర్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, భద్రతా సిబ్బంది ప్రత్యేక వలయంగా ఏర్పడి ఆయన్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. అయితే ఈ టూర్ సమయంలో యువవన్ గౌరవ్ అనే చిన్నారి అభిమాని.. మిస్టర్ బీస్ట్‌కు తాను స్వయంగా గీసిన హ్యాండ్‌మేడ్ స్కెచ్బుక్ను బహుమతిగా ఇచ్చాడు. ఆ చిన్నారి ప్రేమను చూసి జిమ్మీ ఎంతో ఆనందించారు.