భువనేశ్వర్: హైకోర్టు ముందు పార్క్ చేసిన వాహనాలకు ఒక మహిళ నిప్పంటించింది. మండుతున్న వస్తువును కోర్టు ప్రాంగణంలోకి విసిరింది. ఈ సంఘటనలో పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. (Woman Sets Vehicles On Fire) ఒరిస్సాలోని కటక్‌లో ఈ సంఘటన జరిగింది. మంగళవారం ఉదయం కటక్‌లోని ఒరిస్సా హైకోర్టు వద్దకు ఒక మహిళ చేరుకున్నది. కోర్టు బయట పార్క్ చేసిన స్కూటర్ వెనుక పెట్రోల్ పోసి నిప్పుపెట్టింది. మండుతున్న వస్తువును హైకోర్టు ప్రాంగణంలోకి ఆమె విసిరింది.
కాగా, పార్క్ చేసిన వాహనాలకు మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో బొలెరో వాహనం, ఎలక్ట్రిక్ స్కూటర్, రెండు బైకులు పూర్తిగా కాలిపోయాయి. మంటలు, దట్టంగా కమ్ముకున్న పొగలను చూసి అక్కడున్న జనం భయాందోళన చెందారు. మూడు అగ్నిమాపక కేంద్రాలకు చెందిన ఫైర్ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలను ఆర్పివేశారు.
మరోవైపు ఆ మహిళ మీడియాతో మాట్లాడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృష్టిని ఆకర్షించడానికి ఉద్దేశపూర్వకంగా వాహనాలకు నిప్పు పెట్టినట్లు ఆమె చెప్పింది. ‘నేను పెట్రోల్ కొని అందులో పాత బట్టలు నానబెట్టాను. ఒక లేఖ రాశాను. ఆ తర్వాత కొడుకుతో కలిసి ఆటోలో ఇక్కడకు చేరుకున్నా. నా కొడుకు ఐస్ క్రీమ్ కావాలని అడగడంతో స్టాల్ వద్దకు అతడ్ని తీసుకెళ్లా. అగ్గిపుల్ల వెలిగిస్తుండగా వీడియో తీయాలని ఒక యువకుడిని అడిగా. ఏ వాహనాన్ని పాడుచేయాలనే ఉద్దేశం నాకు లేదు. అయితే స్కూటర్‌పై నిప్పురవ్వలు పడటంతో మంటలు వేగంగా వ్యాపించాయి’ అని ఆమె అన్నది.
కాగా, ఆ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. జగత్సింగ్పూర్ జిల్లా బిరిడి ప్రాంతానికి చెందిన మినాటి సాహుగా నిందితురాలిని గుర్తించారు. ప్రధాని మోదీని కలవాలనుకున్నానని, అది కుదరకపోవడంతో ఈ చర్యకు పాల్పడినట్లు నిందితురాలు చెప్పిందని పోలీస్ అధికారి తెలిపారు. ఆ మహిళ మానసికంగా కలత చెందినట్లుగా తెలుస్తున్నదని అన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే హైకోర్టు ప్రాంగణంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
An Abla Nari identified as Minati Sahoo set vehicles on fire at the Odisha High Court premises, resulting in multiple vehicles being gutted. Initially Police suspected that the fire started because of overheating of the battery of some EV parked there.pic.twitter.com/EhV5jNs3Wc
— NCMIndia Council For Men Affairs (@NCMIndiaa) March 31, 2026
Also Read:
Kidney Racket | రూ. 50,000 వివాదంతో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. ఐదుగురు డాక్టర్లు అరెస్ట్
Watch: రాత్రివేళ ఇంటి గోడలు దూకి.. మహిళల లోదుస్తులు దొంగిలిస్తున్న వ్యక్తి
Watch: పర్యాటకుడు గాలిలో ఉండగా.. తెగిన పారాసైలింగ్ తాడు