రాంచీ: ఒక తల్లి దారుణానికి పాల్పడింది. కుమారుడి ఆరోగ్యం కోసం కన్న కుమార్తెను నరబలి ఇచ్చింది. ప్రియుడు, మంత్రగత్తెతో కలిసి కూతుర్ని చంపింది. తాంత్రిక పూజల కోసం కన్య రక్తం కావాలన్న మంత్రగత్తె బాలిక ప్రైవేట్ భాగంలో కర్రను చొప్పించింది. (Woman sacrificed daughter) జార్ఖండ్‌లోని హజారీబాగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 24న కుసుంభ గ్రామానికి చెందిన 12 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. మరునాడు స్థానిక స్కూల్ వెనుక ఉన్న వెదురు తోటలో ఆమె మృతదేహం లభించింది.
కాగా, శ్రీరామనవమి ఊరేగింపు తర్వాత తన కుమార్తె కనిపించలేదని బాలిక తల్లి అయిన 35 ఏళ్ల రేష్మి దేవి పోలీసులకు చెప్పింది. ధనేశ్వర్ పాశ్వాన్, అతడి స్నేహితులు తన కూతురిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు తొలుత వారిపై పోక్సో చట్టంతో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మరోవైపు మార్చి 26న జార్ఖండ్ డీజీపీ, హజారీబాగ్ ఎస్పీ ఆదేశాల మేరకు ఈ కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేశారు. సాంకేతిక ఆధారాలు పరిశీలించిన పోలీసులు, మూఢనమ్మకం కారణంగా తల్లి తన కుమార్తెను నరబలి ఇచ్చినట్లు దర్యాప్తులో తెలుసుకుని షాక్ అయ్యారు.
కాగా, ఆ గ్రామానికి చెందిన 55 ఏళ్ల శాంతి దేవి, క్షుద్రపూజలు చేసే మంత్రగత్తెగా పేరుపొందింది. మానసిక, శారీరక అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడి బాగు కోసం ఆ తాంత్రికురాలిని మూడు నెలలుగా రేష్మి దేవి సంప్రదిస్తున్నది. రామ నవమి సమయంలో దుర్గాష్టమి రోజున కన్యను నరబలి ఇస్తే ఆమె కుమారుడి అనారోగ్యం నయమవుతుందని, కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయని శాంతి దేవి నమ్మించింది. నరబలి కోసం సొంత కుమార్తెను తీసుకురావాలని రేష్మి దేవిని ఆమె ప్రేరేపించింది.
మరోవైపు మార్చి 24న రాత్రివేళ రేష్మి దేవి తన ప్రియుడైన 40 ఏళ్ల భీమ్ రామ్‌తో కలిసి పూజ నెపంతో 12 ఏళ్ల కుమార్తెను తాంత్రికురాలి ఇంటికి తీసుకువెళ్లింది. క్షుద్రపూజల తర్వాత ఆ బాలికను సమీపంలోని వెదురు తోటలోకి తీసుకెళ్లారు. కుమార్తె కాళ్లను తల్లి పట్టుకోగా, భీమ్ రామ్ ఆమె గొంతు నొక్కి చంపాడు. ఆచారం కోసం కన్య రక్తం కావాలన్న మంత్రగత్తె శాంతి దేవి, ఆ బాలిక మర్మాంగంలో కర్రను చొప్పించింది. దీంతో భీమ్ రామ్ ఆ బాలిక తలపై రాయితో కొట్టాడు. ఆ తర్వాత బాలిక మృతదేహాన్ని అక్కడ వదిలేసి వారు వెళ్లిపోయారు.
ఈ విషయాన్ని దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. కుమారుడి అనారోగ్యం నయమవుతుందన్న మూఢనమ్మకం వల్ల కుమార్తెను నరబలి ఇచ్చిన తల్లి రేష్మి దేవి, ఆమె ప్రియుడు భీమ్ రామ్, తాంత్రికురాలు శాంతి దేవిని అరెస్ట్ చేశారు. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. వదిన, మరో వ్యక్తిని హత్య చేసిన ఆరోపణలు కూడా భీమ్ రామ్‌పై ఉన్నాయని చెప్పారు. రేష్మి దేవి భర్త మహారాష్ట్రలో పనిచేస్తాడని, ఇంటికి వచ్చేవాడు కాదని పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Kidney Racket | రూ. 50,000 వివాదంతో కిడ్నీ రాకెట్ గుట్టురట్టు.. ఐదుగురు డాక్టర్లు అరెస్ట్
Raghav Chadha | ఆప్ రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా.. రాఘవ్ చద్దా తొలగింపు
Watch: ఆహారం పెట్టిన వృద్ధురాలు మృతి.. భావోద్వేగంతో విలపించిన కోతి