వనపర్తి టౌన్, జూలై 27 : ప్రజాస్వామ్య స్ఫూర్తికి ఓటు హక్కు వజ్రాయుధమని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేయించుకోవాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సూచించారు. బుధవారం జిల్లా కేంద్రంలోని బూత్‌ల వారీగా విస్తృతంగా పర్యటించి కొనసాగుతున్న సర్ ప్రక్రియను బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పలు సూచనలు చేస్తూ సర్ ప్రక్రియ గడువు ముగస్తున్నందున బీఎల్వోలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఎల్ఏలు చురుకుగా పాల్గొని అర్హులైన ప్రతి ఓటరు వివరాలు సరి చూసి ఓటు హక్కు కోల్పోకుండా చూడాలని పేర్కొన్నారు. పట్టణంలో 63,246 ఓటర్లు ఉండగా దాదాపు 20వేల ఓట్లు గ్రామాలకు తరలిపోతాయని మిగతా వాస్తవ ఓట్లు ఆన్లైన్ పూర్తి చేసి ఆదర్శ పట్టణంగా పేరు తెచ్చుకోవడానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.
జిల్లా కేంద్రంలోని 17వ వార్డులో ఉన్న ఉర్దూ బాలికల ప్రాథమిక పాఠశాలను మాజీ మంత్రి సందర్శించారు. విద్యార్థినులకు ఉర్దూ భాషలోనే పాఠాలు బోధించి కాసేపు ఉపాధ్యాయునిగా మారారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ మొత్తం విద్యార్థి, యువతదిగా ఉండబోతుందని, సమాజంపై అవగాహన, దేశ ఆర్థిక ప్రగతిలో ప్రజాస్వామ్య వ్యవస్థ మెరుగు వంటి కీలక అంశాలను విద్యార్థులకు వివరించారు. తెలంగాణ రాష్ర్టానికి సంబంధించిన అనేక అంశాలు బోర్డుపై రాసి విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు.
మాజీ మంత్రి వెంట బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్, నాయకులు వాకిటి శ్రీధర్, రమేశ్‌గౌడ్, అశోక్, పరంజ్యోతి, మురళీసాగర్, లక్ష్మీనారాయణ, తిరుమల్, ప్రేమ్‌నాథ్‌రెడ్డి, నాగన్నయాదవ్, కృష్ణ, నరసింహ, బాబునాయక్, గులాంఖాదర్ఖాన్, ఇమ్రాన్, నీలస్వామి, వెంకట్‌సాగర్, గిరి, శ్రీనివాసులు, జోహెబ్ హుస్సేన్, సయ్యద్, జమీల్, రాము, ఆరీఫ్, పాషా, శ్రీను, యుగంధర్‌రెడ్డి, శంకర్, లక్ష్మణ్గౌడ్తోపాటు పలువురు పాల్గొన్నారు.