న్యూయార్క్: ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ అత్యంత భారీ రాకెట్ స్టార్‌షిప్‌ను తొలిసారి భూకక్ష్యలో ప్రవేశపెట్టింది. సోమవారం టెక్సాస్‌లోని స్పేస్ఎక్స్ స్టార్‌బేస్ నుంచి చేపట్టిన ఈ ప్రయోగం ద్వారా 26 స్టార్‌లింక్ ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చింది. అయితే స్టార్‌షిప్‌లోని ఓ థ్రస్టర్‌లో లోపం తలెత్తడంతో నిర్ణయించిన సమయానికి దాదాపు ఏడు గంటలు ముందుగానే మిషన్‌ను ముగించాల్సి వచ్చింది. ఈ మిషన్ సుమారు 10 గంటల పాటు కొనసాగుతుందని తొలుత అంచనా వేశారు.
కానీ సూపర్ హెవీ బూస్టర్ నుంచి విడిపోయిన తర్వాత స్టార్‌షిప్‌లోని ఒక థ్రస్టర్ పనిచేయకపోవడంతో ముందుగానే ప్రయోగాన్ని ముగించారు. దీంతో స్పేస్ఎక్స్ స్టార్‌షిప్‌ను నియంత్రిత పద్ధతిలో పసిఫిక్ మహాసముద్రంలో హవాయి సమీపంలోని నిర్దేశిత ప్రాంతంలో కూల్చివేసింది. గతంలో స్టార్‌షిప్ 13 సబ్ ఆర్బిటల్ పరీక్షా ప్రయోగాలు నిర్వహించినప్పటికీ, వాటిలో ఏదీ భూమి చుట్టూ పూర్తి కక్ష్యను పూర్తి చేయలేదు.