కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటాం.. బీరం హర్షవర్ధన్‌రెడ్డి
బీఆర్ఎస్ కోసం పనిచేసే కార్యకర్తలను పార్టీ గుండె ల్లో పెట్టుకొని కాపాడుకుంటుందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని కేఎన్ఆర్ గార్డెన్స్‌లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, బీఎల్ఏలతో మాజీ ఎమ్మెల్యే బీరం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
- కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది
పాన్‌గల్, జూలై 27 : బీఆర్ఎస్ కోసం పనిచేసే కార్యకర్తలను పార్టీ గుండె ల్లో పెట్టుకొని కాపాడుకుంటుందని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని కేఎన్ఆర్ గార్డెన్స్‌లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తలు, బీఎల్ఏలతో మాజీ ఎమ్మెల్యే బీరం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అలివిగాని హామీలతో అధికారంలోకి వచ్చిందని, ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షాలను అణిచివేతకు గురి చేస్తుందని ఆరోపించారు. నీట్ పరీక్ష లీకేజీపై విద్యార్థులతోపాటు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఆందోళన కార్యక్రమాలను చేపట్టిందని ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశారని గుర్తు చేశారు.
బీఆర్ఎస్ పార్టీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం తథ్యమన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే అన్నివర్గాల ప్రజలకు మేలు చేసే అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిందని గుర్తు చేశారు. నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకొని ఇసుక, భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. శ్రీశైలంలోని నీటిని ఆంధ్రప్రదేశ్‌కు తరలించుకపోతుంటే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు.
కొల్లాపూర్ నియోజవర్గంలో మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిందేమిలేదని, ఆయనకు అధికార దాహం తప్పా మరొకటి లేదని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదని.. గడువు ముగిసేలోపు ఎన్యూమరేషన్ ఫారాలను నింపి సంబంధిత అధికారులకు అందజేయాలని పిలుపిచ్చారు. సర్ ప్రక్రియ చివరిదశకు చేరుకున్నదని, అర్హుల ఓట్లు పోకుండా బీఆర్ఎస్ నాయకులు, బూత్లేవల్ ఏజెంట్లు జాగ్రతపడాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వీరసాగర్, నాయకులు చంద్రశేఖర్‌నాయక్, తిలకేశ్వర్‌గౌడ్, జ్యోతినందన్‌రెడ్డి, రాజేశ్వర్‌రెడ్డి, చంద్రూనాయక్, సుధాకర్‌యాదవ్, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

