గద్వాల, జూలై 27 : జూరాలకు ఎగువన వర్షాలు విరివిరిగా కురుస్తుండడంతో నారాయణపూర్ డ్యాం నుం చి నీటిని విడుదల చేస్తుండడంతో కృష్ణమ్మ జూరాల ప్రాజెక్టుకు వడివడిగా పరుగులు పెడుతున్నది. సోమవారం ఉదయం 37,200 క్యూసెక్కుల వరద నీరు రాగా ఆ నీరు జూరాల ప్రాజెక్టుకు చేరుకుం ది. తదుపరి జూరాలకు ఇన్‌ఫ్లో తగ్గినా 12 గంట ల తర్వాత ఇన్‌ఫ్లో పెరిగి 30,400కు చేరుకుం ది. మూడు గంటల వరకు ఇన్‌ఫ్లో 32,800 క్యూసెక్కులకు చేరుకోవడంతో జూరాల కృష్ణమ్మ నీటితో కళకళలాడింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏకైక ప్రాజెక్టు అయి నా జూరాలకు వరద నీరు వచ్చి చేరుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం వరకు జూరాలకు 27,000 క్యూసెక్కులు, రాత్రి త ర్వాత 30 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్నది.
ఈ ప్రవాహం ఇలాగే కొనసాగితే జూరాల ప్రాజెక్టు సో మవారం రాత్రికి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకునే అవకాశం ఉన్నది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రస్తుతం 317.870 మీటర్ల నీటి నిల్వ ఉన్నది. జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.631 టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉన్నది.
జూరాలకు వరద నీరు వచ్చి చేరుతుండండతో నెట్టెంపాడు లిఫ్ట్‌కు 750, భీమా లిఫ్ట్-1కు 1300, కోయిల్‌సాగర్ లిఫ్ట్‌కు 315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అవుట్‌ఫ్లో 1758 క్యూసెక్కులుగా నమోదు కాగా.. పవర్‌హౌస్‌కు 14 వేల క్యూసెక్కులు వదులుతుండగా.. మొత్తం అవుట్‌ఫ్లో 16,408 క్యూసెక్కులుగా నమోదైనట్లు అధికారులు తెలిపారు. జూరాలకు వరద రాక మొదలు కావడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయిజ, జూలై 27 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో తుంగభద్ర డ్యాంకు ఇన్‌ఫ్లో పెరుగుతున్నది. దీంతో డ్యాంలో నీటిమట్టం క్రమేపీ పెరుగుతున్నది. సోమవారం టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో 23,334 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 3,564 క్యూసెక్కులు ఉన్నది. గరిష్ఠ నీటి మట్టం1633 అడుగులకు గానూ ప్రస్తుతం 1607.32 అడుగుల నీటి మట్టం ఉండగా, 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గానూ ప్రస్తుతం 32.596 టీఎంసీల నీటి నిల్వ ఉందని డ్యాం సెక్షన్ అధికారి కిరణ్‌కుమార్ తెలిపారు.