సారంగాపూర్ / కోరుట్ల : పేదింటి ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రవేశ పెట్టిన కల్యాణలక్ష్మి ( Kalyana Lakshmi Scheme ) పథకానికి 12 సంవత్సరాలు పూర్తయి న సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR Portrait ) చిత్రపటానికి పాలాభి షేకం చేశారు.
జగిత్యాల జిల్లా లక్ష్మీదేవిపల్లి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఎంతోమంది పేద కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక సహాయం అందిందని తెలిపారు.

కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేసీఆర్ చిత్రపటానికి బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం పాలాభిషేకం చేశారు. తెలంగాణలో కేసీఆర్ఖ పేదవారి గురించి ఆలోచించి గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు . అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించిన ఘనత కేసీఆర్‌దేనని అన్నారు.