న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడైన రాఘవ్ చద్దా (Raghav Chadha)పై ఆ పార్టీ చర్యలు చేపట్టింది. 2023 నుంచి రాజ్యసభలో ఉప నేతగా ఉన్న ఆయనను ఆ పదవి నుంచి తొలగించింది. పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్‌ను రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్‌గా ఆ పార్టీ నియమించింది. ఈ మార్పునకు సంబంధించి అధికారిక లేఖను రాజ్యసభ సచివాలయానికి ఆప్ పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే సభలో మాట్లాడటానికి రాఘవ్ చద్దాకు సమయం కేటాయించకూడదని కూడా ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది.
కాగా, ఆప్ తీసుకున్న ఈ కీలక నిర్ణయంపై రాఘవ్ చద్దా మౌనం వహించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీలో చీలిక ఏర్పడిందనే వదంతులు మరింత తీవ్రమయ్యాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఇతర నేతలను నిర్దోషులుగా ఢిల్లీ కోర్టు ఫిబ్రవరిలో ప్రకటించింది.
అయితే రాఘవ్ చద్దా దీనిపై స్పందించలేదు. అలాగే పార్టీ కార్యాలయంలో కేజ్రీవాల్ ప్రసంగించిన సమావేశంతో పాటు జంతర్ మంతర్ వద్ద జరిగిన ‘జనసభ’ వంటి కీలక పార్టీ కార్యక్రమాలకు కూడా ఆయన గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రాఘవ్ చద్దా పార్టీకి దూరంగా ఉంటున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజా చర్యతో ఆప్, ఆయన మధ్య విభేదాలు మరింత ముదిరినట్లు తెలుస్తున్నది.
Also Read:
Explosion outside BJP office | పంజాబ్ బీజేపీ కార్యాలయం వద్ద పేలుడు.. పోలీసులు దర్యాప్తు
Fake App Scam | నకిలీ యాప్ ద్వారా మోససోయిన న్యాయమూర్తి.. కేసు నమోదు
Rinku Singh Rahi | పోస్టింగ్ తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి.. తనను పక్కనపెట్టారంటూ రాజీనామా
Watch: ఆహారం పెట్టిన వృద్ధురాలు మృతి.. భావోద్వేగంతో విలపించిన కోతి