ముంబై: సైబర్ నేరగాళ్ల చేతిలో మరో న్యాయమూర్తి మోసపోయారు. నకిలీ యాప్ డోన్లోడ్ చేయడం వల్ల రూ.93,000 పోగొట్టుకున్నారు. ఆ జడ్జి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (Fake App Scam) మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. మార్చి 30న ముంబై సిటీ కోర్డు జడ్జి తన ఫోన్ స్క్రీన్‌లో సమస్యను గమనించారు. ఆన్లైన్లో వెతికిన కస్టమర్ కేర్ సర్వీస్ నంబర్‌ను ఆయన సంప్రదించారు.
కాగా, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌గా నమ్మించిన ఒక వ్యక్తి, 46 ఏళ్ల ఆ న్యాయమూర్తిని మోసగించాడు. ఆయనకు వాట్సాప్ ద్వారా ఒక ఏపీకే ఫైల్ పంపాడు. దానిని డౌన్లోడ్ చేసుకోమని సూచించాడు. రిజిస్ట్రేషన్ కోసం గూగుల్ పే ద్వారా రూ.20 రుసుము చెల్లించాలని సూచించాడు.
మరోవైపు ఆ జడ్జి గూగుల్ పే ద్వారా రూ.20 చెల్లించారు. దీంతో సైబర్ మోసగాడు ఆయన మొబైల్ పరికరం, బ్యాంకింగ్ సమాచారాన్ని రిమోట్ యాక్సెస్ చేశాడు. ఆ వెంటనే జడ్జికి చెందిన ఎస్బీఐ బ్యాంకు ఖాతా నుంచి రూ. 93,000 విలువైన రెండు అనధికార లావాదేవీలు జరిగాయి.
కాగా, మనీ విత్ డ్రా మెసేజ్‌లు చూసిన ఆ న్యాయమూర్తి తాను మోసపోయినట్లు తెలుసుకున్నారు. సైబర్ నేరగాళ్లు తనను లక్ష్యంగా చేసుకున్నారని గ్రహించి పోలీసులను ఫిర్యాదు చేశారు. దీంతో ముంబైలోని టార్డియో పోలీస్ స్టేషన్లో గుర్తు తెలియని నిందితుడిపై కేసు నమోదు చేశారు. ఈ సైబర్ మోసంపై దర్యాప్తు చేస్తున్నారు.
అయితే అదే రోజైన మార్చి 30న మరో సైబర్ మోసం కేసులో బాంబే హైకోర్టు న్యాయమూర్తిని రూ. 6.02 లక్షలకు మోసం చేసిన 25 ఏళ్ల నిందితుడిని పోలీసులు జార్ఖండ్‌లో అరెస్ట్ చేశారు. 10 రాష్ట్రాలలో సుమారు 36 సైబర్ మోసాల కేసులతో ఆ నిందితుడికి సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read:
Explosion outside BJP office | పంజాబ్ బీజేపీ కార్యాలయం వద్ద పేలుడు.. పోలీసులు దర్యాప్తు
Rinku Singh Rahi | పోస్టింగ్ తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి.. తనను పక్కనపెట్టారంటూ రాజీనామా
Watch: హైకోర్టు ముందు వాహనాలకు నిప్పంటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: ఆహారం పెట్టిన వృద్ధురాలు మృతి.. భావోద్వేగంతో విలపించిన కోతి