తుంగతుర్తి, జూలై 29 : సర్ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా అదనపు కలెక్టర్ హరిసింగ్ అన్నారు. బుధవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తాసీల్దార్ కార్యాలయంలో సర్ ప్రక్రియపై వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన డబుల్ ఓట్లు, చనిపోయిన వారి ఓట్లను గుర్తించి తొలగించాలన్నారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసీల్దార్ కంట్లమయ్య, ఆర్ ఐ మణికుమార్, వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.