Bhogi | 800కుపైగా ఆర్టిస్టులతో.. శర్వానంద్ భోగి క్లైమాక్స్ షెడ్యూల్ కంప్లీట్
Bhogi | ఆర్ట్ డైరెక్టర్ కిరణ్‌కుమార్ మన్నె సారథ్యంలో నిర్మించిన భారీ సెట్లో స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో టాలీవుడ్ శర్వానంద్ నటిస్తున్న ‘భోగి’ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరిస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి.
Bhogi | టాలీవుడ్ శర్వానంద్ నటిస్తున్న చిత్రం ‘భోగి’. పాన్ ఇండియా పీరియడ్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రానికి సంపత్‌నంది దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లకు మంచి స్పందన వస్తోంది. కాగా ఆర్ట్ డైరెక్టర్ కిరణ్‌కుమార్ మన్నె సారథ్యంలో నిర్మించిన భారీ సెట్లో స్టంట్ కొరియోగ్రాఫర్ దిలీప్ సుబ్బరాయన్ నేతృత్వంలో క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ని చిత్రీకరిస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఈ సీక్వెన్స్ కోసం శర్వానంద్‌కు రోజూ రెండన్నర గంటల పాటు మేకప్ సెషన్ పెట్టారట.
తాజాగా దీనికి సంబంధించి కీలక అప్డేట్ బయటకు వచ్చింది. భోగి 3 నెలల ప్లానింగ్ షెడ్యూల్లో 22 రోజులపాటు 800 మందికిపైగా జూనియర్ ఆర్టిస్టు టీంతో షూట్ చేసిన క్లైమాక్స్ సీక్వెన్స్ పూర్తయింది. సెట్స్‌లో శర్వానంద్ కుర్చీలో కూర్చొని కనిపిస్తుండగా.. ఎదురుగా జూనియర్ ఆర్టిస్టులు అండ్ విలన్ టీం ఉన్న స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. క్లైమాక్స్ సీక్వెన్స్ భోగి సినిమాకే హైలెట్‌గా నిలిచిపోయేలా గూప్‌బంప్స్ తెప్పించబోతుందని ఇన్సైడ్ టాక్. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. సమర్పణ: లక్ష్మీ రాధామోహన్, నిర్మాణం: శ్రీసత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960స్ ఫిక్షనస్ విలేజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ ఆగస్టు 28న గ్రాండ్‌గా విడుదలకు రెడీ అవుతోంది.
#Sharwanand as #Ganga in #BHOGI, Climax sequence ni next-level scale lo shoot chesaru! 800+ junior artists tho grand ga picturize chesina ee action episode, Sharwanand career loney biggest action sequence. “Ganga” character kosam Sharwanand roju 2.5 hours makeup ki dedicate… pic.twitter.com/b4TWUcN9qd
— Prabhas Fan (@ivdsai) July 29, 2026
Read Also :
US Tariff Bill | అమెరికా రష్యాపై ఆంక్షల బిల్లు.. భారత్, చైనాలపై సుంకాల చిల్లు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

