న్యూఢిల్లీ: పేపర్ లీకేజీ ఘటనలను నియంత్రించేందుకు ప్రధాని మోదీ ఓ హైపవర్డ్ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ కమిటీలో ప్రొఫెసర్ కామకోటి ఉన్నారు. ఆయన ఐఐటీ మద్రాస్ డైరెక్టర్. దేశంలో లీడింగ్ కంప్యూటర్ సైంటిస్టు. కానీ రాజకీయాల్లో ఇప్పుడు ఆయన ఓ చర్చ అయ్యారు. పేపర్ లీకేజీ నిరోధక బిల్లుపై మంగళవారం లోక్‌సభలో ప్రియాంగా గాంధీ మాట్లాడుతూ.. గోమూత్ర నిపుణుడని కమిటీలో చేర్చారంటూ ఎద్దేవా చేశారు. దీంతో కామకోటి పేరు ప్రస్తుతం వివాదాస్పదం అవుతోంది. ప్రొఫెసర్ కామకోటి .. భారతీయ తొలి స్వదేశీ మైక్రోప్రాసెసర్ శక్తిని డెవలప్ చేశారు. కంప్యూటర్ ఆర్కిటెక్ట్, సైబర్ సెక్యూర్టీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఆయన నిష్ణాతుడు.
ఐఐటీ మద్రాసు నుంచి ప్రొఫెసర్ వీ కామకోటి .. మాస్టర్స్ డిగ్రీ చేశారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ సబ్జెక్టులో పీహెచ్డీ కూడా పూర్తి చేశారు. 2001లో ఫ్యాకల్టీ సభ్యుడిగా ఆయన ఇన్స్టిట్యూట్లో చేరాడు. 2022లో ఐఐటీ మద్రాసు డైరెక్టర్ అయ్యారు. కంప్యూటర్ ఆర్కిటెక్చర్, ఇన్ఫర్మేషన్ సెక్యూర్టీ, వీఎల్ఎస్ఐ డిజైన్‌లో ఆయనకు విశేష అనుభవం ఉన్నది. కేంద్ర ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ఆధీనంలో జరిగే ప్రోగ్రామ్‌లను ఆయన పరిశీలిస్తుంటారు. శక్తి మైక్రోప్రాసెసర్ బృందంలో ఆయన కీలక సభ్యుడిగా ఉన్నారు. సెమీకండక్టర్ టెక్నాలజీ అభివృద్ధిలో శక్తి ముఖ్యభూమిక నిర్వహిస్తోంది.
‘आप मुझसे नाराज़ लग रहे…’ Priyanka Gandhi ने स्पीकर OM Birla से क्या कहा, पूरे सदन में लगे ठहाके pic.twitter.com/mhgYdwOk5o
— News Pinch (@TheNewspinch) July 28, 2026
నేషనల్ సెక్యూర్టీ అడ్వైజరీ బోర్డులో ప్రొఫెసర్ కామకోటి సభ్యుడిగా ఉన్నారు. గతంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్‌కు చైర్మెన్‌గా ఉన్నారు. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆ టాస్క్‌ఫోర్స్‌ను నిర్వహించింది. ఐఐటీ మద్రాసులో ఆయన ఎన్నో కీలక పదవులను అలంకరించారు. జేఈఈ చైర్మెన్‌గా, ఇండస్ట్రియల్ కన్సల్టన్సీ, రీసర్చ్కు అసోసియేట్ డీన్‌గా చేశారు. పద్మశ్రీ అందుకున్నారు. టెక్నాలజీలో ఆయన్ను లీడర్‌గా కీర్తిస్తారు. సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కేటగిరీలో ఆయనకు పద్మశ్రీ దక్కింది. కంప్యూటర్ ఆర్కిటెక్చర్ రీసర్చ్, నేషనల్ సెక్యూర్టీలో ఆయన తన అధ్యయనం చేశారు.
ప్రియాంకా గాంధీ లోక్‌సభలో మాట్లాడుతూ.. హైపవర్డ్ కమిటీలో మాజీ ఐబీ చీఫ్, ఐటీ కంపెనీ ఓనర్, గోమూత్ర నిపుణుడు ఉన్నట్లు విమర్శించారు. తన ప్రసంగంలో ఆమె పూర్తిగా వివరణ ఇవ్వకున్నా.. ప్రొఫెసర్ కామకోటిని ఉద్దేశిస్తూ గోమూత్ర నిపుణుడు అంటూ ప్రియంకా వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. బ్యాక్టీరియా, ఫంగస్‌ను నియంత్రించే శక్తి గోమూత్రానికి ఉందని గతంలో కామకోటి కామెంట్ చేశారు. అయితే ప్రియాంకా గాంధీ చేసిన వ్యాఖ్యలకు లోక్‌సభలో బీజేపీ కౌంటర్ ఇచ్చింది. సీనియర్ నేత అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ కామకోటిని డిఫెండ్ చేసుకున్నారు. భారత దేశ ప్రఖ్యాత శాస్త్రవేత్త, విద్యావేత్త అంటూ కామకోటిని ప్రశంసించారు. దేశ టెక్నాలజీ, జాతీయ భద్రతకు ఎంతో సేవ చేసిన శాస్త్రవేత్తను అవమానించడం దురదృష్టకరమని ఠాకూర్ అన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టాస్క్ ఫోర్స్‌కు అధిపతిగా పనిచేశారని, అలాంటి వ్యక్తిని తక్కువగా చూడడం భావ్యం కాదన్నారు. ప్రొఫెసర్ కామకోటికి ఆర్ఎస్ఎస్తో సంబంధాలు ఉన్నట్లు కొందరు ఎంపీలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఎంపీ అనురాగ్ కాస్త ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రియాంకా గాందీ, రాహుల్ గాంధీ కూడా గోమూత్రాన్ని సేవించాలన్నారు.
VIDEO | Delhi: BJP MP Anurag Thakur reacts to Congress leader Priyanka Gandhi’s ‘gaumutra expert’ remark. He says, “I will answer Priyanka ji after this. The way she makes an innocent face, misleads people, smiles subtly, and even asks the Speaker to smile, she does this while… pic.twitter.com/IRdvjspMLl
— Press Trust of India (@PTI_News) July 28, 2026
పేపర్ లీకేజీలపై కామకోటి ఇటీవల మాట్లాడారు. పేపర్లను తయారు చేసే వారి మధ్య ఐక్యత ముఖ్యమన్నారు. భారతీయ విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాల్ అదే అన్నారు. విద్యా వ్యవస్థ ఏదైనా, రెండు వర్గాల ప్రజల మధ్య నమ్మకం ముఖ్యమన్నారు. క్వశ్చన్ పేపర్ సెట్టర్లు చాలా కీలకమైన గ్రూపు అని, ఇక ఎగ్జామ్ సెంటర్ల వద్ద ఇన్విజిలేటర్లు కూడా ముఖ్యమే అన్నారు. క్వశ్చన్ పేపర్ సెట్టర్ల మధ్య విశ్వాసాన్ని నింపడమే అతిపెద్ద సవాల్ అని ఆయన అన్నారు. ఎగ్జామ్ సెంటర్ల వద్ద సీసీటీవీ కెమెరాలతో నిఘా వ్యవస్థను పెంచినా.. ఒకవేళ ప్రశ్నాపత్రాన్ని తయారు చేసే వ్యక్తులు కాంప్రమైజ్ అయితే లీకులను నివారించడం కష్టం అవుతుందని అన్నారు. 2024 నీట్ పేపర్ లీకే అనేది ప్రింటింగ్ తర్వాత ప్రశ్నపత్రాలను చేరవేస్తున్న సమయంలో జరిగిందని, కానీ 2026 లీక్ భిన్నమైందని, అది క్వశ్చన్ పేపర్ సెట్ చేసిన వారి నుంచే పుట్టినట్లు ఆయన పర్కొన్నారు. నమ్మకమైన విద్యావేత్తలు అవసరం అన్నారు. నమ్మకమైన టీచర్లు కావాలని, ప్రశ్నపత్రాన్ని సెట్ చేసి, పూర్తిగా నమ్మకంతో బాధ్యతల పట్ల కట్టుబడి ఉండాలని ఆయన అన్నారు. ఇదే అతిపెద్ద ఛాలెంజ్ అన్నారు.
ఇన్ఫోసిస్ కో ఫౌండర్ నందన్ నిలేఖని నేతృత్వంలోని హైపవర్డ్ కమిటీలో ఇస్రో మాజీ చైర్మెన్ ఎస్. సోమనాథ్, ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ డైరెక్టర్ తపన్ దీపక్, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ వీ కామకోటి, విద్యాశాఖ మాజీ కార్యదర్శి అనితా కర్వాల్, లాజిస్టిక్స్ నిపుణుడు అమృత్ లాల్ మీనా ఉన్నారు.