SIR | ‘సర్’ను రద్దు చేయండి.. సీజేఐకి 2 వేల మందికి పైగా పౌరుల బహిరంగ లేఖ
SIR | కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ‘సర్'లో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని 2 వేల మందికి పైగా పౌరులు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కు ఇటీవల లేఖ రాశారు.
SIR | న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ‘సర్’లో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని 2 వేల మందికి పైగా పౌరులు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్‌కు ఇటీవల లేఖ రాశారు. ‘సర్’ విషయంలో న్యాయ వ్యవస్థ వెంటనే జోక్యం చేసుకోవాలని, సుమోటోగా స్వీకరించాలని కోరారు. సర్‌పై వెంటనే స్టే విధించి దాన్ని రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ లేఖపై మాజీ రాజ్యసభ ఎంపీ జవహర్ సిర్కార్, ఆర్థికవేత్తలు జయతీ ఘోష్, కమల్ మల్హోత్రా, రిటైర్డ్ ప్రొఫెసర్లు ఆదిత్య, మృదుల ముఖర్జీ, ఆర్టీఐ కార్యకర్త అంజలి భరద్వాజ్ తదితరులు సంతకాలు చేశారు.
విద్యావేత్తలు, న్యాయవాదులు, మాజీ సివిల్ సర్వెంట్లు, సామాజిక కార్యకర్తలు, పాత్రికేయులు, రిటైర్డ్ సైనిక ఉద్యోగులు సీజేఐకు ఈ బహిరంగ లేఖ రాస్తూ.. ఈసీ పనితీరుపై, దాని కేంద్రీకృత ఈసీఐనెట్ టెక్నాలజీపై స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాలన్నారు. స్థానిక ఎన్నికల అధికారులను కాదని ఈ టెక్నాలజీ ద్వారా ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు చేయడం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి విరుద్ధమని తెలిపారు. ఈ విషయంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్, ఇతర అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కమిషనర్ల మధ్య అంతర్గత భిన్నాభిప్రాయాలు ఉండటంపై లేఖ రాసిన పౌరులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫామ్-6 మార్పులపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. సాంకేతిక లోపాలు, సాఫ్ట్వేర్ లాక్ లేదా విధానపరమైన మార్పుల వల్ల తొలగించిన ఓట్లను వెంటనే పునరుద్ధరించాలని కోరారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

