చండీగఢ్: పంజాబ్ బీజేపీ కార్యాలయం బయట పేలుడు సంభవించింది. బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాటు బాంబు విసిరి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. (Explosion outside BJP office) బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో చండీగఢ్ సెక్టార్ 37లోని పంజాబ్ బీజేపీ కార్యాలయం వెలుపల అనుమానాస్పద పేలుడు సంభవించింది. ఈ సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. పేలుడు వల్ల ఒక స్కూటీ, కారు విండో స్వల్పంగా ధ్వంసమైనట్లు గుర్తించారు. ఆధారాల సేకరణ కోసం సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ బృందాన్ని రప్పించారు.
కాగా, బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు నాటు బాంబు లేదా నాటు పేలుడు పరికరం విసిరి అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను గుర్తించేందుకు సమీప ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. బీజేపీ కార్యాలయం వద్ద భద్రతను పటిష్టం చేశారు. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) సిబ్బందిని అక్కడ మోహరించారు. ఈ సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
Also Read:
Rinku Singh Rahi | పోస్టింగ్ తొలి రోజే గుంజీలు తీసిన ఐఏఎస్ అధికారి.. తనను పక్కనపెట్టారంటూ రాజీనామా
Watch: హైకోర్టు ముందు వాహనాలకు నిప్పంటించిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: ఆహారం పెట్టిన వృద్ధురాలు మృతి.. భావోద్వేగంతో విలపించిన కోతి