జగిత్యాల టౌన్, జూలై 26 : ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆరోగ్యకార్డుల అమల్లో అయోమయానికి తెరదించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర కార్యదర్శి బీ దేవయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్కార్ హెల్త్ కార్డులు ఇచ్చి చేతులు దులుపుకొన్నదని మండిపడ్డారు. ఆదివారం జగిత్యాలలో ఆయన మాట్లాడుతూ ఈహెచ్ఎస్ పై పూర్తి మార్గదర్శకాలు లేకుండానే మే నెల నుంచే వేతనాల మినహాయింపులు చేసి ఉ ద్యోగులను ఆర్థిక నష్టానికి గురి చేస్తున్నారని విమర్శించారు.
ఇప్పటికీ దవాఖానలతో ఒ ప్పందం కుదరలేదని, ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ నాయకులు ఇటీవల ప్ర భుత్వాన్ని కలిసి ఈహెచ్ఎస్ రేట్లు తమకు సరిపోవని తెలిపారని చెప్పా రు. కొన్ని దవాఖానలకు తమ పేరు ఈహెచ్ఎస్ లిస్ట్‌లో ఉన్నట్టే తెలియదని వి మర్శించారు.
ప్రభుత్వం పేర్కొన్న ఈహెచ్ఎస్ దవాఖానల్లో ఉద్యోగులకు వైద్యం అం దించే అవకాశంలేదని, అదికూడా 2 లక్షల వరకే చికిత్స అందిస్తారని ఆందోళన వ్యక్తంచేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి 1.5 శాతం మినహాయింపులు కాకుండా కుటుంబసభ్యుల సంఖ్య మేరకు రూ. 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షల స్లాబులకు మినహాయింపు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.