హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం 72 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశమున్నదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశమున్నదని వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్నదని అధికారులు తెలిపారు.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ప్రస్తుతం దేశంలో నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ఊపందుకున్నదని అధికారులు చెప్పారు. మరోవైపు ఎ ల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.