భోపాల్: మద్యం సమకూర్చకపోవడంపై కొందరు పెళ్లి అతిథులు ఆగ్రహించారు. ఈ విషయంపై గొడవకు దిగారు. ఈ నేపథ్యంలో వధూవరులు, వారి కుటుంబ సభ్యులను కొట్టారు. ఈ దాడిలో పెళ్లికొడుకు, పెళ్లి కుమార్తెతో సహా పలువురు గాయపడ్డారు. (Guests Assault Bride, Groom) మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మార్చి 31న మంగళవారం రాత్రి పటాయ్ గ్రామానికి చెందిన మహేష్ జాతవ్ పెళ్లి జరిగింది. వధువు, ఆమె కుటుంబం అతడి ఇంటికి చేరగా కొన్ని పెళ్లి తంతులు పూర్తయ్యాయి.
కాగా, పెళ్లి వేడుకకు హాజరైన కొందరు పొరుగువారు తమకు మద్యం ఏర్పాటు చేయకపోవడంపై వరుడు మహేష్‌తో వాగ్వాదానికి దిగారు. మద్యం సమకూర్చాలని లేదా దాని కోసం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరుడు మహేష్ నిరాకరించడంతో అతడితో గొడవపడ్డారు.
మరోవైపు ఈ వివాదం ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారి తీసింది. ఈ నేపథ్యంలో వరుడు మహేష్, వధువుతో పాటు ఇరువురి కుటుంబ సభ్యులను ఆ వ్యక్తులు కొట్టారు. గాయపడిన కొందరిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై ఫిర్యాదు అందినట్లు పోలీస్ అధికారి తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
शराब के पैसे नहीं मिले तो शादी में बवाल, पड़ोसियों ने दुल्हन को पीटा | GwaliorNews#GwaliorNews #WeddingFight #BrideAssault #MPNews #ShadiMeBawal #ViralNews pic.twitter.com/oQNTOJY0F1
— Public Vani News (@publicvaninews) April 2, 2026
Also Read:
Raghav Chadha | ఆప్ రాజ్యసభ డిప్యూటీ లీడర్‌గా.. రాఘవ్ చద్దా తొలగింపు
Woman sacrificed daughter | కుమారుడి ఆరోగ్యం కోసం.. కుమార్తెను నరబలి ఇచ్చిన తల్లి
Watch: ఒక ఇంట్లోకి చొరబడిన వ్యక్తి.. మహిళలు ఏం చేశారంటే?