Nitin Gadkari | E20 పెట్రోల్ వల్ల మైలేజీ 2-6 శాతం తగ్గవచ్చు: నితిన్ గడ్కరీ
Nitin Gadkari | ఇథనాల్ 20 శాతం కలిపిన E20 పెట్రోల్ వల్ల వాహన రకం, తయారీ సంవత్సరాన్ని బట్టి ఇంధన సామర్థ్యం 2 నుంచి 6 శాతం వరకు తగ్గవచ్చని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌కు తెలిపారు. అయితే ఈ ఇంధనం వల్ల ఇంజిన్ వైఫల్యాలు సంభవించినట్లు పరీక్షల్లో తేలలేదని చెప్పారు.
న్యూఢిల్లీ: ఇథనాల్ 20 శాతం కలిపిన E20 పెట్రోల్ వల్ల వాహన రకం, తయారీ సంవత్సరాన్ని బట్టి ఇంధన సామర్థ్యం 2 నుంచి 6 శాతం వరకు తగ్గవచ్చని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్‌కు తెలిపారు. (Nitin Gadkari) అయితే ఈ ఇంధనం వల్ల ఇంజిన్ వైఫల్యాలు సంభవించినట్లు పరీక్షల్లో తేలలేదని చెప్పారు. గురువారం లోక్‌సభకు, బుధవారం రాజ్యసభకు వేర్వేరుగా లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు. ప్రభుత్వ సంస్థలు, వాహన తయారీదారులు నిర్వహించిన అధ్యయనాల ప్రకారం E20 ఇంధనం వాహనాలకు సురక్షితమేనని తేలిందని అన్నారు. అయితే 2016కు ముందు తయారైన కొన్ని బీఎస్-3 వాహనాలకు సాధారణ సర్వీసింగ్ సమయంలో కొన్ని రబ్బరు భాగాలు, గాస్కెట్లను మార్చవలసి ఉంటుందని వివరించారు.
కాగా, గురువారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. బీఎస్-3, 4, 6 ప్రమాణాలతో ఉన్న E10 (గ్యాసోలిన్) ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలపై E20 ఇంధనం ప్రభావాన్ని అంచనా వేయడానికి ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా ఒక అధ్యయనాన్ని నిర్వహించాయని తెలిపారు. ‘వాహన రకం, తయారీ కాలం ఆధారంగా వాహనాల ఇంధన సామర్థ్యం 2 నుంచి 6 శాతం వరకు తగ్గవచ్చు. డైనమోమీటర్పై ఇంజిన్ మన్నిక పరీక్షలు, రోడ్డుపై నిర్వహించిన వాహన పరీక్షలలో E20 ఇంధనం వల్ల ఎటువంటి లోపాలు లేదా వైఫల్యాలు కనిపించలేదు’ అని పేర్కొన్నారు. అలాగే E10 ఇంధనంతో పోలిస్తే, E20 ఇంధనం మెరుగైన ఏక్సాలరేషన్, ప్రయాణ అనుభవాన్ని అందించడమే కాకుండా, కార్బన్ ఉద్గారాలను దాదాపు 30 శాతం వరకు తగ్గిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు.
మరోవైపు పాత వాహనాలపై వ్యక్తమవుతున్న ఆందోళనలపై రాజ్యసభలో గడ్కరీ వివరణ ఇచ్చారు. పాత కార్లు, ద్విచక్ర వాహనాల ఇంజిన్లలో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని అధ్యయనాలు తేల్చాయని తెలిపారు. E20 ఇంధనాన్ని ఉపయోగించినప్పుడు, పాత వాహనాల పనితీరులో పెద్దగా తేడాలు గానీ, అసాధారణమైన అరుగుదల గానీ కనిపించలేదని పరిశోధనలో తేలిందని చెప్పారు. వాహనాన్ని నడపడం, స్టార్ట్ చేయడం, లోహాలు, ప్లాస్టిక్ భాగాల అనుకూలతకు సంబంధించి ఎలాంటి సమస్యలు తలెత్తలేదని ఆ అధ్యయనాలు వెల్లడించాయని అన్నారు.
అయితే 2016కు ముందు తయారైన BS-3 వాహనాలపై జరిపిన పరీక్షల్లో, E20 ఇంధనాన్ని వాడినప్పుడు కొన్ని రబ్బరు భాగాలు, గ్యాస్కెట్లను మార్చాల్సి రావచ్చని పరీక్షల్లో తేలిందని గడ్కరీ తెలిపారు. వాహనాలు సాధారణ సర్వీసింగ్ సమయంలోనే వీటిని సులభంగా మార్చుకునే వీలుందని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
GV Prakash | టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తున్న జీవీ ప్రకాశ్.. బాలయ్య-కొరటాల సినిమాకు కూడా ఛాన్స్!
సమసమాజ స్థాపనే మహాత్మా పూలే ఆశయం
Lemon Juice | నిమ్మకాయ నుంచి సులభంగా రసం పిండాలంటే.. వంటింటి చిట్కా..
Deeksha Divas | దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Ullipoola Song | ‘ఇడుపు కాయితం’ నుంచి మరో ఫోక్ మెలోడీ.. ‘ఉల్లిపూల సిరే గట్టి’ పాట విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

