GV Prakash | టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తున్న జీవీ ప్రకాశ్.. బాలయ్య-కొరటాల సినిమాకు కూడా ఛాన్స్!
GV Prakash | టాలీవుడ్లో ప్రస్తుతం తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ హవా కొనసాగుతోంది. వరుస సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువవుతున్నారు. ఈ ఏడాది తెలుగులో ఆయన సంగీతం అందించిన సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, పాటలు కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి.
GV Prakash | టాలీవుడ్లో ప్రస్తుతం తమిళ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ హవా కొనసాగుతోంది. వరుస సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువవుతున్నారు. ఈ ఏడాది తెలుగులో ఆయన సంగీతం అందించిన సినిమాలు వరుసగా ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, పాటలు కూడా మంచి ఆదరణ సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా, వాటి పాటలు మాత్రం మ్యూజికల్‌గా ఆకట్టుకున్నాయి. దీంతో టాలీవుడ్‌లోని స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లకు జీవీ ప్రకాశ్ గట్టి పోటీ ఇస్తున్నారనే చర్చ మొదలైంది.
ఈ ఏడాది ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాతో పాటు మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’, సూర్య హీరోగా తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’, దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఆకాశంలో ఒక తార’ వంటి చిత్రాలకు జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు. ముఖ్యంగా ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోకపోయినా, పాటలు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ‘ఆకాశంలో ఒక తార’ సినిమాతో ఆయన మరోసారి తన సంగీత ప్రతిభను చాటుకున్నారు. ఈ సినిమాకు తనకు నేషనల్ అవార్డు కూడా రావచ్చని జీవీ ప్రకాశ్ చెప్పినట్లు దర్శకుడు పవన్ సాదినేని ఓ సందర్భంలో వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.
ఇక ప్రస్తుతం టాలీవుడ్లో ఆయన సంగీతం అందించిన మరో సినిమా పాట సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ మూవీకి జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలోని ‘డివికి డివికి’ పాట తాజాగా విడుదలై మంచి స్పందనను సొంతం చేసుకుంది. క్యాచీ ట్యూన్‌తో రూపొందిన ఈ పాట యూట్యూబ్‌లో 32 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ పాటకు వస్తున్న ఆదరణతో జీవీ ప్రకాశ్ పేరు మరోసారి టాలీవుడ్లో మార్మోగుతోంది.అంతేకాదు.. 2027 సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానున్న ఈ సినిమాపై జీవీ ప్రకాశ్ కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ అవుతుందంటూ ఆయన చేసిన ట్వీట్ కూడా సినీ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. దీంతో వచ్చే సంక్రాంతికి తన సంగీతంతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇదిలా ఉంటే, జీవీ ప్రకాశ్‌కు మరో భారీ ప్రాజెక్ట్ దక్కినట్లు టాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. నందమూరి బాలకృష్ణ, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కనున్న NBK112 సినిమాకు సంగీత దర్శకుడిగా జీవీ ప్రకాశ్ కుమార్ పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ను కొరటాల శివ ఇప్పటికే సిద్ధం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ పేరు కూడా గతంలో వినిపించింది. తాజాగా జీవీ ప్రకాశ్ పేరు తెరపైకి రావడంతో ఈ సినిమాకు ఎవరు సంగీతం అందిస్తారనే ఆసక్తి నెలకొంది. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
GV Prakash | టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తున్న జీవీ ప్రకాశ్.. బాలయ్య-కొరటాల సినిమాకు కూడా ఛాన్స్!
సమసమాజ స్థాపనే మహాత్మా పూలే ఆశయం
Lemon Juice | నిమ్మకాయ నుంచి సులభంగా రసం పిండాలంటే.. వంటింటి చిట్కా..
Deeksha Divas | దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Ullipoola Song | ‘ఇడుపు కాయితం’ నుంచి మరో ఫోక్ మెలోడీ.. ‘ఉల్లిపూల సిరే గట్టి’ పాట విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

