సమసమాజ స్థాపనే మహాత్మా పూలే ఆశయం
మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తూ సమానత్వ సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కొక్కు శంకర్ పిలుపునిచ్చారు.
ఊట్కూర్ : మహాత్మా జ్యోతిరావు పూలే ( Mahatma Phule ) ఆశయాలను కొనసాగిస్తూ సమానత్వ సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కొక్కు శంకర్, జోగిని వ్యవస్థ వ్యతిరేక పోరాట సమితి జిల్లా కన్వీనర్ హాజమ్మ, మాజీ ఉపసర్పంచ్ కొండన్ గోపాల్ పిలుపునిచ్చారు.
శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ ( Utkoor) మండల కేంద్రంలో మహాత్మా జ్యోతిరావు పూలే 136వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, బడుగు బలహీన వర్గాల విద్యాభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప సంఘసంస్కర్త అని కొనియాడారు.
కులవివక్ష, అంటరానితనం, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా పోరాడి సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేశారని గుర్తుచేశారు. ముఖ్యంగా మహిళా విద్యకు బాటలు వేసి, విద్య ద్వారానే సామాజిక అభివృద్ధి సాధ్యమని చాటిచెప్పిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన ఆశయాలు, పోరాట స్ఫూర్తి నేటి తరాలకు నిరంతరం మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ, కొండన్ భరత్, దుర్గం శ్రీనివాస్, బలరాం, బీఎస్పీ నాయకుడు గౌతమ్, బీజేపీ నాయకుడు తిమ్మప్ప, వార్డు సభ్యులు మల్లేష్, నరేష్, హర్షవర్ధన్ రెడ్డి, పరశురాం, నాగరాజు ,తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సమసమాజ స్థాపనే మహాత్మా పూలే ఆశయం
Lemon Juice | నిమ్మకాయ నుంచి సులభంగా రసం పిండాలంటే.. వంటింటి చిట్కా..
Deeksha Divas | దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
Ullipoola Song | ‘ఇడుపు కాయితం’ నుంచి మరో ఫోక్ మెలోడీ.. ‘ఉల్లిపూల సిరే గట్టి’ పాట విడుదల!
Supreme Court | యాసిడ్ అమ్మకాలపై పూర్తి నిషేధం విధించండి.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదన..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

