Police Complaint | అమెజాన్ ప్రైమ్‌లోకి ‘పోలీస్ కంప్లైంట్’.. రేపటి నుంచి స్ట్రీమింగ్!
Police Complaint On Prime | థియేటర్లలో తనదైన మార్కుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వైవిధ్యమైన హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది.
Police Complaint On Prime | థియేటర్లలో తనదైన మార్కుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న వైవిధ్యమైన హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’ ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసేందుకు సిద్ధమైంది. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మాత బాలకృష్ణ మహారాణా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రానికి క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. గత జూన్ నెలలో తెలుగు మరియు కన్నడ భాషల్లో దాదాపు 300 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు పొందడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సాధించింది. IMDb వంటి ప్రముఖ సినీ రేటింగ్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు డిజిటల్ మీడియాలోనూ సంచలన రేటింగ్‌లు, సానుకూల సమీక్షలు అందుకని ఐకానిక్ హిట్ సాధించిన ఈ చిత్రం, ఇప్పుడు ఈ శుక్రవారం అంటే జూలై 31 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో తెలుగు మరియు కన్నడ భాషల్లో అందుబాటులోకి రానుంది.
వరలక్ష్మి శరత్‌కుమార్, నవీన్ చంద్ర, కృష్ణసాయి, రాగిణి ద్వివేది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా హారర్, మిస్టరీ, థ్రిల్లింగ్ యాక్షన్ ఎలిమెంట్స్ యొక్క అద్భుత సమ్మేళనంగా తెరకెక్కింది. ముఖ్యంగా నటి వరలక్ష్మి శరత్‌కుమార్ తన నటనా ప్రయాణంలోనే మొదటిసారిగా పూర్తిస్థాయి వినోదాత్మక (ఎంటర్టైన్మెంట్) పాత్రలో కనిపించడం ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆమె తనదైన నటనతో అలరించగా, నటుడు నవీన్ చంద్ర తన విలక్షణమైన యాక్టింగ్‌తో కథకు బలాన్ని చేకూర్చి ప్రేక్షకులను కట్టిపడేసారు.
సమాజంలోని మూఢనమ్మకాలు, వాటి వెనుక ఉన్న నగ్న సత్యాలు మరియు “చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ” (కర్మ సిద్ధాంతం) అనే అత్యంత ఆసక్తికరమైన కాన్సెప్ట్‌ను ఈ కథలో దర్శకుడు సంజీవ్ మేగోటి ఎంతో ప్రతిభావంతంగా ఆవిష్కరించారు. కథలోని హారర్ మరియు థ్రిల్లింగ్ అంశాలు సీటు అంచున కూర్చోబెట్టే అనుభూతిని కలిగిస్తాయి. దానికి తోడు, దివంగత సూపర్‌స్టార్ కృష్ణ గారికి ఘనంగా నివాళి అర్పిస్తూ కృష్ణసాయి సమక్షంలో రూపొందించిన ప్రత్యేక గీతం అభిమానులకు, ప్రేక్షకులకు విపరీతమైన కంటిపాపలా ప్రత్యేక ఆకర్షణగా మారింది. థియేటర్లలో అద్భుతమైన ఉత్కంఠభరిత అనుభవాన్ని అందించిన ఈ హారర్-యాక్షన్ చిత్ర రాజాన్ని, ఇకపై ప్రైమ్ వీడియో ద్వారా ఇంట్లోనే కూర్చుని డిజిటల్ స్క్రీన్‌పై తిలకించి ఆస్వాదించవచ్చు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

