Sheikh Hasina : స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా(Sheikh Hasina)కు బంగ్లాదేశ్ ప్రభుత్వం హెచ్చరికుల చేసింది. డిసెంబర్లో సొంతగడ్డకు వెళ్తానని పేర్కొన్న హసీనాను ఎట్టిపరిస్థితుల్లోనూ వదలబోమని న్యాయశాఖ మంత్రి ఎం అసాదుజ్జమన్(M Asaduzzaman) తెలిపారు. ఆమె దేశంలో అడుగుపెట్టగానే అరెస్ట్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. కోర్టులో లొంగిపోవాలనుకుంటున్న ఆమె ప్రయత్నాలను తిప్పకొడతామని, లొంగుబాటుకు ముందే తనను అదుపులోకి తీసుకుంటామని అసాదుజ్జమన్ వెల్లడించారు.
బంగ్లాదేశ్‌లో నిరసనకారులపై హింస కేసులో ఉరి శిక్షకు గురైన మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఊరట లభించేలా లేదు. నిరుడు నవంబర్ 25న కోర్టు మరణ శిక్ష విధించిన నేపథ్యంలో.. డిసెంబర్లో స్వదేశం వెళ్లాలనుకుంటున్న ఆమెను రాగానే అరెస్ట్ చేయాలని ప్రభత్వం భావిస్తోంది. జూలై 29, బుధవారం అసోసియేటెడ్ ప్రెస్(AFP)తో మాట్లాడుతూ తాను కచ్చితంగా స్వదేశం వెళ్తానని అవామీ లీగ్ అధినేత్రి చెప్పారు.
STORY | Hasina to be arrested on return, before she can surrender: Bangladesh law minister
Deposed Bangladesh prime minister Sheikh Hasina is likely to be arrested instantly on her return from India, before getting opportunities to surrender directly to a court, Bangladesh Law… pic.twitter.com/lfFuJG3QHy
— Press Trust of India (@PTI_News) July 30, 2026
‘నేను హత్యకు గురికావొచ్చు. నన్ను అరెస్ట్ చేయవచ్చు. లేదా నన్ను జైలుకు పంపవచ్చు. నా విధి పట్ల పూర్తి అవగాహనతో ఉన్నా. ఏది ఏమైనా సరే నేను తిరిగి వెళ్తాను. ఎందుకంటే నా ప్రజలు నన్ను పిలుస్తున్నారు’ అని 78 ఏళ్ల హసీనా వెల్లడించారు. అంతే.. హసీనా ఈ ప్రకటన చేయడంతో దేశంలో కాలుమోపగానే అరెస్టు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Bangladesh’s former PM Sheikh Hasina tells AFP she will return to Bangladesh but could be killed.
“I am fully aware of my fate. Still, I want to go back because my people are calling me.” pic.twitter.com/KoURZiZxFH
— News Arena India (@NewsArenaIndia) July 29, 2026
‘హసీనాకు తిరిగి స్వదేశం వచ్చే హక్కు ఉంది. అయితే.. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అలాఅనీ మేము చట్టాన్ని అతిక్రమించం. హసీనా దేశంలో అడుగుపెట్టగానే అరెస్ట్ చేస్తాం. ఆమెకు కోర్టులో లొంగిపోయే అవకాశం ఇవ్వం’ అని అసాదుజ్జామన్ పేర్కొన్నారు. అయితే.. 2024లో హసీనా గద్దెదిగాక ఏర్పడిన మొహమ్మద్ యూనస్ ఆధ్వర్యంలో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం ఆమె పాస్‌పోర్టును రద్దు చేసింది. దాంతో.. ‘హసీనా ఇప్పుడు స్వదేశం ఎలా రాగలరు?’ అనే ప్రశ్నకు అసాదుజ్జామన్.. ‘అది ఆమె సమస్య. నాది కాదు’ అని బదులిచ్చారు.