Harish Rao | ఇంజనీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. ఈ కామెంట్స్‌పై ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు.
చేసిందేమి లేదు కానీ ఇంజినీరింగ్ పిల్లలను క్రిమినల్ వేస్ట్ అని యావత్ ఇంజనీరింగ్ విద్యార్థులను అవమానిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆ విద్యార్థులకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను అవమానపరిచే విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆయనకు అసలేం మాట్లాడుతడో తెల్వదు. ఇంజనీరింగ్ చదివిన మన పిల్లలు ప్రపంచదేశాల్లో అద్భుతంగా రాణిస్తూ ఈ రాష్ట్రానికి తెలుగు ప్రజలకు పేరు తెస్తే ఆ పిల్లలను క్రిమినల్ వేస్ట్ అంటవా..? రేవంత్ రెడ్డి అని అడిగారు. నీ మైండ్ సరిగా లేదు.. ఆ మాటలు వెనక్కు తీసుకో. ఆ ఇంజనీరింగ్ విద్యార్థులకు, ఉపాధ్యాయులకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నానన్నారు.
ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని వాళ్లను ముఖ్యమంత్రి అవమానిస్తున్నాడు
మన పిల్లలు ఇంజనీరింగ్ చదివి ఎన్నో దేశాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు
నీ మైండ్ సరిగా లేదు.. విద్యార్థులకు క్షమాపణ చెప్పు
– హరీష్ రావు https://t.co/P6LzEqqtGj pic.twitter.com/0jJHdNM5gm
— Telugu Scribe (@TeluguScribe) July 30, 2026
Municipal Commissioner | భద్రకాళి బండ్‌పై పెండింగ్ పనులను పూర్తి చేయాలి : బల్దియా కమిషనర్
Punjab Paper Leaks | పంజాబ్‌లో వరుస పేపర్ లీకేజీలు.. ఆప్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన
Yellampalli Project | ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న గోదావరి జలాల ఎత్తిపోతలు