న్యూశాయంపేట : భద్రకాళి బండ్ (Bhadrakali Bund ) పై పెండింగ్ పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని బల్దియా కమిషనర్ టి.వెంకన్న ( Venkanna ) అధికారులను ఆదేశించారు. గురువారం నగర పరిధిలోని భద్రకాళి, వడ్డేపల్లి బండ్ లను క్షేత్ర స్థాయిలో సందర్శించి పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకొన్నారు. పనులు వేగవంతంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా భద్రకాళి బండ్ పై పూర్తి చేసిన పనుల వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకొని మాట్లాడుతూ త్వరితగతిగా బండ్‌పై మిగిలిపోయిన పెండింగ్ పనులను ఆగస్టులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. భద్రకాళి బండ్, వడ్డేపల్లి బండ్ పై హార్టికల్చర్‌కు సంబంధించి గ్రీనరీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, కమిషనర్ వెంట పర్యవేక్షక ఇంజనీర్ రాజ్ కుమార్, హార్టికల్చర్ అధికారి లక్ష్మిరెడ్డి, డీఈ రాజ్ కుమార్, ఏఈ హరికుమార్ తదితరులు ఉన్నారు.