హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అగ్రకుల అహంకారంతో వ్యవహరిస్తూ తనతోపాటు ఎందరో దళిత, ఎన్ఎస్యూఐ నాయకులను చిన్నచూపు చూస్తున్నారని ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్‌స్వామి సంచలన ఆరోపణలు చేశారు. బల్మూరి వెంకట్ ఉద్దేశపూర్వకంగానే సోషల్ మీడియాలో తనపై వ్యతిరేక కథనాలు రాయిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన ఫిర్యాదు పత్రాన్ని సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. బల్మూరి వెంకట్‌కు దళితులన్నా, ఎన్ఎస్యూఐ నేతలన్నా గిట్టదని మండిపడ్డారు. తన పెత్తనం సాగాలనే సంకుచిత మనస్తత్వంతో అగ్రకుల విద్యార్థి నేతలను తనపైకి ఉసిగొలిపారని ఆరోపించారు. తనను తొలగించేందుకు కొందరు దళితులను అడ్డంపెట్టుకొని కుట్రలు చేస్తున్నారని దుయ్యబట్టారు. దళిత, బడుగు బలహీనవర్గాల నాయకులను ఎదగకుండా కుతంత్రాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బల్మూరి వెంకట్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకొని ఎన్ఎస్యూఐని కాపాడాలని పార్టీ అధిష్ఠానానికి విజ్ఞప్తిచేశారు.
ఎమ్మెల్సీ బల్మూరిపై వెంకటస్వామి సంచలన ఆరోపణలు చేస్తూ ఏఐసీసీకి లేఖ రాయడం రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో కలకలం సృష్టించింది. ఆయన లేఖతో దళిత నాయకులపై పార్టీలోని అగ్రకుల నాయకులు చేస్తున్న కుట్రలు బహిర్గతమయ్యాయనే చర్చ జరుగుతున్నది. గతంలోనూ దళిత, బీసీలను చిన్నచూపు చూస్తున్నారని బల్మూరి వెంకట్‌పై ఆరోపణలు రాగా, తాజాగా వెంకట్‌స్వామి అధిష్ఠానానికి రాసిన లేఖ ఆ ఆరోపణలకు ఊతమిచ్చిందని పలువురు భావిస్తున్నారు. ఈ పరిణామాలు మున్ముందు ఎటువైపు దారితీస్తాయోనని చర్చించుకుంటున్నారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : పీఆర్సీ రిపోర్టు, సీపీఎస్ రద్దు అంశాన్ని ప్రభుత్వం వెంటనే తేల్చాలని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు వొద్నాల రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య డి మాండ్ చేశారు. గురువారం ప్రకటన విడు దల చేశారు. ఈ నెల 18 లోపు పీఆర్సీ రిపో ర్టు తెప్పిస్తామని చెప్పిన సర్కార్ జాప్యం చేస్తున్నదని మండిపడ్డారు. వెంటనే రిపోర్టు ను బహిర్గత పర్చాలని, రెండు డీఏల జీవో విడుదల చేయాలని కోరారు. ఉపాధ్యాయు లపై ప్రభుత్వ తీరును అంతా గమనిస్తున్నార ని తెలిపారు. మాడల్ స్కూల్ ఉపాధ్యాయు లకు 010 పద్దు అమలు, కేజీబీవీ మహిళా టీచర్లకు సమ్మె శాలరీ చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తే మరోమారు ఉద్యమ కార్యాచరణ చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.