సిటీబ్యూరో, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ) : గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఈనెల 25, 26 తేదీల్లో మెట్రో సేవలను అర్ధరాత్రి ఒంటి గంట వరకు పొడిగించారు. అన్ని స్టేషన్ల నుంచి చివరి రైలు ఒంటి గంటకు బయలు దేరుతుందని అధికారులు తెలిపారు. శోభాయాత్రలో పాల్గొనే భక్తులు, రాత్రి సమయంలో ప్రయాణించేందుకు వీలుగా ఈ సేవలను పొడిగించినట్లుగా తెలిపారు.
క్యూ లైన్లలో నిరీక్షణ లేకుండా ప్రధాన స్టేషన్ల వద్ద అదనపు టికెట్ కౌంటర్లు, డిజిటల్ కోడ్ స్కానింగ్ సదుపాయాలను పెంచామన్నారు. ఖైరతాబాద్, లక్డీకాపూర్, అసెంబ్లీ, ఎంజీబీఎస్ వంటి కీలక స్టేషన్లలో అదనపు భద్రతా సిబ్బంది, స్పెషల్ సిబ్బందిని కూడా నియమిస్తున్నట్లుగా తెలిపారు.