Unemployees | అధికారంలోకి రాగానే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ హామీలను నెరవేర్చకుండా తమ పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై నిరుద్యోగులు భగ్గుమంటున్నారు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం అతి తక్కువ పోస్టులతో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటికే రోడ్డెక్కి ధర్నాలు చేస్తూ ఆందోళనలు చేపట్టారు.
తాజాగా అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీల వద్ద నిరుద్యోగులు మెరుపు ధర్నా చేపట్టారు. 7437 పోస్టులు కాదు.. 19000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆందోళనలో పాల్గొన్న నిరుద్యోగులు ఎస్సై, కానిస్టేబుల్ వయో పరిమితి సడలింపు చేయాలన్నారు.
మెగా డీఎస్సీతోపాటు ఖాళీగా ఉన్న గ్రూప్- I, II, III, IV ఇతర నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. నిరుద్యోగులను పోలీసులు బలవంతంగా వ్యాన్లలో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించారు.
7437 పోస్టులు కాదు.. 19000 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలి
అశోక్ నగర్, చిక్కడపల్లి లైబ్రరీల వద్ద నిరుద్యోగుల మెరుపు ధర్నా
వర్షంలో సైతం ఆందోళన చేస్తున్న నిరుద్యోగులు
19 వేల పోస్టులతో కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్
ఎస్సై, కానిస్టేబుల్ వయో పరిమితి సడలింపు… pic.twitter.com/QzmoE1ITeb
— Telugu Scribe (@TeluguScribe) July 30, 2026
Municipal Commissioner | భద్రకాళి బండ్పై పెండింగ్ పనులను పూర్తి చేయాలి : బల్దియా కమిషనర్
Punjab Paper Leaks | పంజాబ్లో వరుస పేపర్ లీకేజీలు.. ఆప్ కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన
Yellampalli Project | ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కొనసాగుతున్న గోదావరి జలాల ఎత్తిపోతలు