హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులకు అనుకూలమైన ప్రాంతంగా అభివృద్ధి చెందిందని, హైదరాబాద్ నగరం ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్ తదితర రంగాల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ తెలిపారు.
విదేశాల్లో స్థిరపడిన తెలుగు ప్రజలు మాతృభూమితో అనుబంధాన్ని కొనసాగిస్తూ, రాష్ర్టాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జర్మనీ పర్యటనలో భాగంగా ఫ్రాంక్‌ఫర్ట్‌లో భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్‌తో కలిసి వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు.