Dava Vasantha Suresh | కోరుట్ల ఎమ్మెల్యే నివాసంపై కాంగ్రెస్ దాడి అప్రజాస్వామికం : దావ వసంత సురేష్
Dava Vasantha Suresh | కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌కుమార్ మెట్‌పల్లిలోని నివాసంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల దాడి ని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ తీవ్రంగా ఖండించారు.
కోరుట్ల : కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌కుమార్ ( MLA Sanjay Kumar ) మెట్‌పల్లిలోని నివాసంపై కాంగ్రెస్ ( Congress ) నాయకులు, కార్యకర్తల దాడి ( Attack) ని జగిత్యాల జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ( Dava Vasantha Suresh ) తీవ్రంగా ఖండించారు. డాక్టర్ సంజయ్ కుమార్ విజయం సాధించడాన్ని స్థానిక కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించాల్సింది పోయి, ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి నివాసంపై ముట్టడికి దిగడం వారి రాజకీయ అసహనానికి నిదర్శనమని ఆరోపించారు.
గతంలో కోరుట్ల ఎమ్మెల్యేగా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషి, ప్రజలకు అందించిన సేవలను గుర్తించిన ప్రజలు, ఆయన తనయుడు డాక్టర్ సంజయ్ కుమార్ ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. మంచి వైద్యుడిగా, ఉన్నత విద్యావంతుడిగా, ప్రజాసేవ పట్ల నిబద్ధత కలిగిన వ్యక్తిగా ఆయనపై ప్రజలు విశ్వాసం ఉంచారు. తండ్రి చూపిన అభివృద్ధి బాటలో తనయుడు కూడా నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడటం బాధాకరమని అన్నారు.రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం ఉంటే అభివృద్ధి పనుల్లో పోటీ పడాలని, అంతేకానీ ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యే నివాసంపై దాడులు, ముట్టడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వివరించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై సమగ్ర విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను డిమాండ్ చేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dava Vasantha Suresh | కోరుట్ల ఎమ్మెల్యే నివాసంపై కాంగ్రెస్ దాడి అప్రజాస్వామికం : దావ వసంత సురేష్
రుణాల పేరుతో మహిళలకు రూ.20 లక్షల టోకరా!
లబ్ధిదారులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత
MP Vamsi Krishna | ఎంపీ వంశీకృష్ణ వర్సెస్ మంత్రి శ్రీధర్ బాబు అనుచరులు.. వీడియో
Karepalli | విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంపునకు చర్యలు తీసుకోవాలి
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

