లబ్ధిదారులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత
ములకలపల్లి మండలానికి నూతనంగా 516 చేయూత పింఛన్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి...
– దివ్యాంగుడికి రూ.4 లక్షలతో రోబోటిక్ లెగ్ అందిస్తామని హామీ
ములకలపల్లి, నవంబర్ 17 : ములకలపల్లి మండలానికి నూతనంగా 516 చేయూత పింఛన్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 2026 సంవత్సరానికి సంబంధించి మండలంలో చేయూత పింఛన్ల కోసం మొత్తం 620 దరఖాస్తులు రాగా, వాటిలో 516 మందికి పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. మిగిలిన 104 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన నిరుపేదలకే పింఛన్లు అందుతాయన్నారు.
ఇదే కార్యక్రమంలో చలమన్ననగర్కు చెందిన గంగారాజు అనే వ్యక్తి ఎమ్మెల్యేను కలిసి తన కాలు కోల్పోయానని, ముగ్గురు పిల్లలతో కుటుంబాన్ని పోషించుకోవడం భారంగా మారిందని వివరించి సహాయం కోరాడు. ఆయన పరిస్థితిని చూసి చలించిపోయిన ఎమ్మెల్యే, సుమారు రూ.4 లక్షల ఖర్చుతో కూడిన ఆధునిక రోబోటిక్ లెగ్ (కృత్రిమ కాలు) అమర్చేందుకు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. మరోవైపు, చేయూత పింఛన్లతో పాటు వృద్ధుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని మరిన్ని వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయాలని బీఆర్ఎస్ నాయకులు, తిమ్మంపేట సర్పంచ్ తుర్రం శ్రీను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్యనారాయణ, ప్రత్యేక అధికారి రమేష్, ఎంపీఓ రమేష్ బాబు, ఏఓ అరుణ్ బాబు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జహీర్, నాయకులు ప్రభాకర్ రావు, పేటేటి నర్సింహారావు, కారం సుధీర్, సీపీఐ నాయకులు నరాటి ప్రసాద్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
లబ్ధిదారులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత
MP Vamsi Krishna | ఎంపీ వంశీకృష్ణ వర్సెస్ మంత్రి శ్రీధర్ బాబు అనుచరులు.. వీడియో
Karepalli | విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంపునకు చర్యలు తీసుకోవాలి
‘సింగరేణి పరిరక్షణకు త్వరలో టిబిజికెఎస్ ఆధ్వర్యంలో యాత్ర’
Dr. C. Lakshmareddy | కాంగ్రెస్ పార్టీ నయవంచనకు మూడేళ్లు : మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

