రుణాల పేరుతో మహిళలకు రూ.20 లక్షల టోకరా!
రుణాలు ఇప్పిస్తానని నమ్మించి 25 మంది మహిళల వద్ద సుమారు రూ.20 లక్షలు వసూలు చేసిన ఓ ప్రైవేటు బ్యాంకు ఏజెంట్ పరారైన ఘటన ములకలపల్లి మండలంలోని మూకమామిడి పంచాయతీ పరిధి సాయిరాంపురంలో వెలుగుచూసింది. గ్రామానికి గడ్డం వెంకటేష్...
– 25 మంది మహిళల వద్ద డబ్బులు వసూలు చేసి ఏజెంట్ పరార్
ములకలపల్లి, నవంబర్ 17 : రుణాలు ఇప్పిస్తానని నమ్మించి 25 మంది మహిళల వద్ద సుమారు రూ.20 లక్షలు వసూలు చేసిన ఓ ప్రైవేటు బ్యాంకు ఏజెంట్ పరారైన ఘటన ములకలపల్లి మండలంలోని మూకమామిడి పంచాయతీ పరిధి సాయిరాంపురంలో వెలుగుచూసింది. గ్రామానికి గడ్డం వెంకటేష్ ప్రైవేటు బ్యాంకుల ఏజెంట్‌గా పని చేస్తున్నాడు. మహిళలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తానని, వాటి నెలవారీ వాయిదాలను సైతం తానే చెల్లిస్తానని నమ్మబలికి విడతల వారీగా వారి నుండి డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో సుమారు 25 మంది మహిళల నుండి రూ.20 లక్షల వరకు వసూలు చేసి కనిపించకుండా పోయినట్లు తెలిపారు.
ఇటీవల సంబంధిత బ్యాంకు సిబ్బంది మహిళల ఇళ్లకు చేరుకుని రుణాల వాయిదాలు చెల్లించాలని కోరడంతో అసలు విషయం వెలుగుచూసింది. తాము ఎలాంటి రుణాలు తీసుకోలేదని, ఏజెంట్‌కే డబ్బులు చెల్లించామని మహిళలు చెప్పడంతో తాము మోసపోయినట్లు గుర్తించారు. దీంతో బాధిత మహిళలు, గ్రామస్తులు మంగళవారం ములకలపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేశారు. తమ వద్ద డబ్బులు వసూలు చేసి పరారైన ఏజెంట్‌ను వెంటనే పట్టుకుని, తమకు న్యాయం చేయాలని పోలీసులను కోరారు. బాధితుల ఫిర్యాదును స్వీకరించిన ఎస్.మధు ప్రసాద్ ఘటనపై విచారణ చేపట్టారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రుణాల పేరుతో మహిళలకు రూ.20 లక్షల టోకరా!
లబ్ధిదారులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ చేయూత పింఛన్ల మంజూరు పత్రాలు అందజేత
MP Vamsi Krishna | ఎంపీ వంశీకృష్ణ వర్సెస్ మంత్రి శ్రీధర్ బాబు అనుచరులు.. వీడియో
Karepalli | విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంపునకు చర్యలు తీసుకోవాలి
‘సింగరేణి పరిరక్షణకు త్వరలో టిబిజికెఎస్ ఆధ్వర్యంలో యాత్ర’
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

