Karepalli | విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంపునకు చర్యలు తీసుకోవాలి
Karepalli | ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్ రెడ్డి మంగళవారం సింగరేణి మండలంలో పర్యటించారు.
కారేపల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ( Learning abilities ) మెరుగుపరిచే లక్ష్యంతో జిల్లా అకాడమిక్ మానిటరింగ్ అధికారి పెసర ప్రభాకర్ రెడ్డి (Pesara Prabhakar Reddy ) మంగళవారం సింగరేణి మండలంలో పర్యటించారు. జిల్లా ఎఫ్ఎల్ఎన్ సెల్ సభ్యులు శ్యామ్‌లాల్, ప్రవీణ్‌లతో కలిసి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి విద్యా బోధన తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
విద్యార్థులందరికీ నాణ్యమైన విద్య అందేలా ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేయాలని, నిర్దేశించిన విద్యా లక్ష్యాలను సాధించే దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగాలని సూచించారు. అనంతరం ఆయా పాఠశాలల ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమై విద్యార్థుల ప్రగతిపై చర్చించారు.విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, బోధనలో నూతన పద్ధతుల అమలు, పాఠశాలల విద్యా ప్రమాణాల మెరుగుదలకు చేపట్టాల్సిన కార్యాచరణపై ఉపాధ్యాయులకు అకాడమిక్ గైడెన్స్ అందించారు.
ఉపాధ్యాయులు బోధిస్తున్న విధానం, విద్యార్థుల అభ్యసన స్థాయి, వర్క్‌బుక్స్, నోటు పుస్తకాల దిద్దుబాట్లు, ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమంలో భాగంగా వెనుకబడిన విద్యార్థులకు అందిస్తున్న అదనపు శిక్షణ, గ్రంథాలయ పీరియడ్ నిర్వహణ, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ వినియోగం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంపునకు చర్యలు తీసుకోవాలి
‘సింగరేణి పరిరక్షణకు త్వరలో టిబిజికెఎస్ ఆధ్వర్యంలో యాత్ర’
Dr. C. Lakshmareddy | కాంగ్రెస్ పార్టీ నయవంచనకు మూడేళ్లు : మాజీ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి
మట్టి అక్రమంగా తరలిస్తున్న లారీ పట్టివేత
YS Sharmila | ఇది వావివరసలు తెలిసినోడు చేసే పనేనా..? సోదరుడు జగన్‌పై వైఎస్ షర్మిల ఫైర్
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

