న్యూఢిల్లీ: ఒక వ్యక్తి, తన తల్లి మధ్య సంబంధం ఉన్నదని ఆమె కుమారుడు అనుమానించాడు. వారిద్దరూ కలిసి వెళ్లడాన్ని గమనించాడు. బైక్‌పై అక్కడకు చేరుకున్నాడు. తల్లితో ఉన్న వ్యక్తిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన అతడు మరణించాడు. (Son stabs mother’s friend) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. మార్చి 27న అమన్ అనే వ్యక్తి ఒక మహిళతో కలిసి పశ్చిమ్ విహార్ నుంచి నిహాల్ విహార్ వైపు ప్రయాణించాడు.
కాగా, ఆ మహిళ కుమారుడు రోహిత్ ఇది తెలుసుకున్నాడు. తన తల్లి, అమన్ మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానించాడు. బైక్‌పై వారిని వెంబడించాడు. నిహాల్ విహార్ ప్రాంతంలో అమన్‌ను అడ్డుకున్నాడు. అతడిపై కత్తితో దాడి చేసి పలుమార్లు పొడిచాడు. ఆ తర్వాత అక్కడి నుంచి బైక్‌పై పారిపోయాడు.
మరోవైపు తీవ్రంగా గాయపడిన అమన్ చికిత్స పొందుతూ మరణించాడు. అమన్ సోదరుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన మహిళ కుమారుడు రోహిత్‌ను అరెస్ట్ చేశారు. తల్లితో సంబంధం ఉన్నట్లు అనుమానించి అమన్‌ను అతడు హత్య చేశాడని పోలీస్ అధికారి తెలిపారు. నిందితుడు రోహిత్‌పై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
Also Read:
Khushbaz Jattana | ఆగి ఉన్న వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. కాంగ్రెస్ నేత, ఆయన డ్రైవర్ మృతి
Watch: ఒక ఇంట్లోకి చొరబడిన వ్యక్తి.. మహిళలు ఏం చేశారంటే?
Watch: స్కూటీపై వెళ్తున్న వ్యక్తిపై ఎద్దు దాడి.. తర్వాత ఏం జరిగిందంటే?