చుంచుపల్లి, ఆగస్టు 03 : తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్, విద్యానగర్ (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) ఆధ్వర్యంలో సోమవారం చుంచుపల్లి మండలం రూప్ల తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, రాందాస్ తండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటుబుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, షార్ప్నర్స్, రబ్బర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొల్లు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఈ ఏడాది ఇప్పటికే 8 ప్రభుత్వ పాఠశాలలకు విద్యాసామగ్రి అందజేశామని, ప్రస్తుతం ఈ రెండు పాఠశాలలతో కలిపి మొత్తం 10 పాఠశాలలకు సహాయం చేసినట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ఉపాధ్యాయులు మరింత కృషి చేస్తే, రాబోయే సంవత్సరాల్లో మరింత ఉత్సాహంతో విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించేందుకు అసోసియేషన్ ముందుంటుందని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు సీతారామశాస్త్రి, రామిరెడ్డి, రషీద్, గ్రామ సర్పంచ్ బొజ్జ రామారావు, రూప్ల తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు భావ్ సింగ్, రాందాస్ తండా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, అంగన్వాడీ ఉపాధ్యాయులు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సీనియర్ సిటిజన్ అసోసియేషన్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వారు అభినందిస్తూ, భవిష్యత్లో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు.