పోలీస్‌స్టేషన్‌లోకి ముసుగు వ్యక్తులు ఎలా వచ్చారు? ప్రశ్నించిన దేశపతి శ్రీనివాస్
వినాయక చవితి వంటి పవిత్రమైన పండుగ రోజున సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పీఆర్వో మహేశ్, పీఏ మహేందర్ రెడ్డిపై దాడిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ విచారణ పేరుతో కేటీఆర్ సిబ్బందిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
వినాయక చవితి వంటి పవిత్రమైన పండుగ రోజున సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పీఆర్వో మహేశ్, పీఏ మహేందర్ రెడ్డిపై దాడిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ విచారణ పేరుతో కేటీఆర్ సిబ్బందిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వేధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. చట్టాన్ని, న్యాయస్థానాల ఉత్తర్వులను గౌరవించాల్సిన పోలీసు యంత్రాంగం.. కోర్టు ఆదేశాలను సైతం పక్కనబెట్టి పండుగ రోజున ఈ విధంగా వ్యవహరించడం పక్కా రాజకీయ కక్షసాధింపేనని ఆయన ఆరోపించారు.
రాష్ట్రానికి రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా హోంశాఖను కూడా నిర్వహిస్తున్నారని దేశపతి శ్రీనివాస్ పేర్కొన్నారు. శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన హోంశాఖ నేరుగా ముఖ్యమంత్రి పరిధిలోనే ఉందన్నారు. అలాంటి పరిస్థితుల్లో పోలీస్‌స్టేషన్‌లో లీగల్ టీమ్ సమక్షంలో ఉన్న సమయంలోనే ముసుగులు ధరించిన అపరిచిత వ్యక్తులు ప్రత్యక్షమవడం అత్యంత దారుణమని విమర్శించారు.
ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఇలాంటి అనుమానాస్పద పరిణామాలు చోటుచేసుకోవడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన కలిగిస్తోందని అన్నారు. పోలీస్‌స్టేషన్‌లోకి ముసుగు వ్యక్తులు ఎలా వచ్చారు? వారు ఎవరు? వారి వెనుక ఎవరున్నారు? అనే అంశాలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
హోంశాఖను నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఘటనపై ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా తక్షణమే నిష్పాక్షిక విచారణ జరిపించాలని కోరారు.
పోలీస్‌స్టేషన్‌లోకి ముసుగు వ్యక్తులు ప్రవేశించిన తీరుపై సమగ్ర దర్యాప్తు చేసి, బాధ్యులను గుర్తించాలని.. ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీస్‌స్టేషన్ వంటి రక్షిత ప్రదేశంలోనే ఇలాంటి ఘటనలకు అవకాశం కల్పిస్తే సామాన్య ప్రజలకు భద్రత ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
Shashi Tharoor: ఇందిరా గాంధీని ఇంటర్వ్యూ చేసిన శశిథరూర్.. ఆనాటి ఫోటో షేర్ చేసిన కాంగ్రెస్ ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

