‘వలసల నివారణే లక్ష్యం’
ఎల్‌నినో ప్రభావంతో కూలీలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా గ్రామాల్లోనే పనులు కల్పించడమే లక్ష్యంగా ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపడుతున్నట్లు ఏపీఓ కడెం రామ్మోహన్ తెలిపారు. శుక్రవారం కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల గ్రామంలో...
– ఏపీఓ కడెం రామ్మోహన్
కట్టంగూర్, నవంబర్ 20 : ఎల్‌నినో ప్రభావంతో కూలీలు ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా గ్రామాల్లోనే పనులు కల్పించడమే లక్ష్యంగా ఉపాధి హామీ పథకం ద్వారా పనులు చేపడుతున్నట్లు ఏపీఓ కడెం రామ్మోహన్ తెలిపారు. శుక్రవారం కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల గ్రామంలో కోమటికుంటలో జరుగుతున్న ఉపాధి హామీ (వీబీ జీ రాం జీ) పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కూలీలతో మాట్లాడి వారి సమస్యలు, పనుల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం మండలంలో సుమారు 2,500 మంది కూలీలు ఉపాధి పనుల్లో పాల్గొంటున్నారని తెలిపారు. కూలీలు పని కావాలని కోరిన వెంటనే పనులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
భూగర్భ జలాల పరిరక్షణ, నీటి పొదుపు, భవిష్యత్‌లో నీటి భద్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి రైతుకు పంట కుంట తప్పనిసరిగా నిర్మించుకునేలా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వర్షపు నీటిలో ప్రతి చుక్కను భూమిలోకి ఇంకింపజేయడం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించుకోవచ్చని వివరించారు. నీటి వనరులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. అనంతరం కూలీలతో భూగర్భ జలాల సంరక్షణపై ప్రతిజ్ఞ చేయించి, నీటి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ముషం భవాని, మేట్ వెంకన్న పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘వలసల నివారణే లక్ష్యం’
నెమ్మాది భిక్షంకు మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి పరామర్శ
Patnam Narender Reddy | అసమర్ధతను కప్పిపుచ్చుకునేందుకే కేసీఆర్ కుటుంబంపై తిట్ల రాజకీయాలు : మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి
‘‘ప్రజా గర్జన – ఛలో హైదరాబాద్’ ని జయప్రదదం చేయండి’
‘ఆదివాసీ యువకుడు తెల్లం శరత్ మృతి ఘటనపై సమగ్ర విచారణ జరపాలి’
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

