‘‘ప్రజా గర్జన – ఛలో హైదరాబాద్’ ని జయప్రదదం చేయండి’
డిసెంబర్ 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘ప్రజా గర్జన – ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కెచ్చెల రంగారెడ్డి పిలుపునిచ్చారు. ములకలపల్లి మండలంలోని రాచన్నగూడెం గ్రామంలో శుక్రవారం...
– సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కెచ్చెల రంగారెడ్డి పిలుపు
ములకలపల్లి, నవంబర్ 20 : డిసెంబర్ 29న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘ప్రజా గర్జన – ఛలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కెచ్చెల రంగారెడ్డి పిలుపునిచ్చారు. ములకలపల్లి మండలంలోని రాచన్నగూడెం గ్రామంలో శుక్రవారం జిల్లా కమిటీ సభ్యులు పోతుగంటి లక్ష్మణ్ అధ్యక్షతన నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు పోరాడి సాధించుకున్న ప్రాథమిక, కార్మిక, కర్షక హక్కులతో పాటు దళితులు, ఆదివాసీలు, పేదల హక్కులను మోదీ, అమిత్ షా నాయకత్వంలోని బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రభుత్వం హరిస్తోందన్నారు. ప్రజలకు మాట్లాడే, ప్రశ్నించే స్వేచ్ఛ లేకుండా నిర్బంధ విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ అణచివేత విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామికవాదులు, పౌర సమాజం పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఎన్నికల హామీలను అమలు చేయాలి
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందన్నారు. కొన్ని పథకాలను అరకొరగా అమలు చేస్తూ, మిగిలిన హామీలను విస్మరిస్తోందన్నారు. ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న పింఛన్లను పెంచి అమలు చేయాలని, కార్మికులకు ప్రకటించిన చేయూత పథకాన్ని ప్రారంభించాలని డిమాండ్ చేశారు. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంతో పాటు ఉపాధి హామీ పథకాన్ని 250 రోజులకు పొడిగించి రోజువారీ వేతనం రూ.700 చెల్లించాలన్నారు. పెండింగ్ స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలన్నారు.
కరువు సహాయక చర్యలు చేపట్టాలి
రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. గ్రామాల్లో తాగునీరు, పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. ఉపాధి హామీ పనులను విస్తృతంగా చేపట్టి కూలీలకు పని కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి ముద్దా భిక్షం, సహాయ కార్యదర్శి నాయిని రాజు, కెచ్చెల కల్పన, అమర్లపూడి రాము, నూపా భాస్కర్, గోకినేపల్లి ప్రభాకర్, జాటోత్ కృష్ణ, మధుసూదన్ రెడ్డి, ఈసం శంకర్, మాచర్ల సత్యం, పోతుగంటి లక్ష్మణ్, కల్లూరి కిషోర్, రాచన్నగూడెం సర్పంచ్ మడకం విజయ, ఉప సర్పంచ్ వగ్గెల వెంకటేష్, నకిరికంటి నాగేశ్వరరావు, పద్దం లక్ష్మణరావు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

