‘పున్న కైలాష్ బహిరంగ క్షమాపణ చెప్పాలి’
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలో గల వీటి కాలనీలో...
– ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు సహించేది లేదు
– తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ డిమాండ్
నకిరేకల్, నవంబర్ 20 : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు, ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ డిమాండ్ చేశారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలో గల వీటి కాలనీలో శాసన మండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై మాట్లాడే నైతిక హక్కు పున్న కైలాష్కు లేదన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకుని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పదవుల కోసం కోమటిరెడ్డి బ్రదర్స్‌పై విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.
ప్రోటోకాల్ మీరు పాటిస్తున్నారా?
గుంతలో ఉన్న నక్క లొట్టపిట్ట కోసం ఆశపడినట్లుగా పదవుల కోసం ఆశపడటం సరికాదని విమర్శించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ నల్లగొండ జిల్లాలో ఒక ప్రత్యేకమైన బ్రాండ్ అని, వారి రాజకీయ ప్రస్థానం, ప్రజా సేవను తక్కువ చేసి మాట్లాడడం తగదని హితవు పలికారు. పార్టీ క్రమశిక్షణ గురించి మాట్లాడే ముందు మీ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటిస్తున్నారా? కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫొటో అయినా మీ కార్యక్రమాల్లో పెడుతున్నారా? అని ప్రశ్నించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత క్షేత్రస్థాయిలో ఎంతవరకు పర్యటించారు? పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను ఎంతవరకు కలిశారు? అని నిలదీశారు. కేవలం పది మందితో జిల్లా కేంద్రంలో ప్రెస్మీట్లు నిర్వహిస్తే పార్టీ బలోపేతం అవుతుందా? పార్టీని బలోపేతం చేయాలంటే కార్యకర్తలను కలుపుకొని ముందుకు సాగాలని సూచించారు.
డీసీసీ అధ్యక్షుడిగా అనర్హుడు
డీసీసీ అధ్యక్షుడిగా కొనసాగడానికి పున్న కైలాష్కు నైతిక అర్హత లేదని, వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి డెలిగేట్ సుంకరబోయిన నరసింహ యాదవ్, చిట్యాల మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఛత్రపతి, బొల్లెపల్లి సర్పంచ్ వల్లపు శ్రీనివాస్ రెడ్డి, ఆరేగూడెం సర్పంచ్ నాగంపల్లి శ్యామ్, అన్నారం సర్పంచ్ సైదులు, ముక్కామల శేఖర్, మాజీ డీసీసీ కార్యదర్శి కోట పుల్లయ్య, మాజీ డీసీసీ ప్రధాన కార్యదర్శి మాద లింగస్వామి గౌడ్, కట్టంగూరు మాజీ పట్టణ అధ్యక్షుడు చెరుకు యాదగిరి, రంగు వీరయ్య, వెంకటేష్, చీకటి గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు శ్రీను, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బోస్, చెరుకు సైదులు, చెరుకు యాదయ్య, నాగరాజు, నవీన్, యాకోబు, చారి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

