‘బాలల హక్కుల పరిరక్షణతోనే బంగారు భవిష్యత్‌కు పునాది’
బాలల హక్కుల పరిరక్షణతోనే బంగారు భవిష్యత్‌కు పునాది పడుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి కే.ఎం.తార అన్నారు. అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం చుంచుపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి...
– భద్రాద్రి జిల్లా సంక్షేమ అధికారిణి కే.ఎం.తార
చుంచుపల్లి, నవంబర్ 20 : బాలల హక్కుల పరిరక్షణతోనే బంగారు భవిష్యత్‌కు పునాది పడుతుందని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారిణి కే.ఎం.తార అన్నారు. అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా శుక్రవారం చుంచుపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బాలలే దేశ భవిష్యత్‌కు నిజమైన సంపద అన్నారు. ప్రతి బాల బాలికకు సురక్షితమైన బాల్యం, నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. బాలల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. బాలల అభిప్రాయాలకు గౌరవం ఇవ్వడంతో పాటు వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు.

‘బాలల హక్కుల పరిరక్షణతోనే బంగారు భవిష్యత్‌కు పునాది’
బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాలు, బాలలపై లైంగిక వేధింపులు, హింస, అక్రమ రవాణా వంటి సామాజిక రుగ్మతలను నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఏ బాలుడూ పేదరికం, సామాజిక అసమానతల కారణంగా విద్యకు దూరం కాకూడదని, వారికి పౌష్టికాహారం, వైద్య సేవలు, మానసిక ఆరోగ్య పరిరక్షణ అందేలా చూడాలని పేర్కొన్నారు. బాలల హక్కుల ఉల్లంఘనలు ఎక్కడైనా గుర్తిస్తే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాలల సంరక్షణ అధికారి హరి కుమారి, మహిళా సాధికారత సిబ్బంది సౌజన్య, షీ టీం ఎస్ఐ రమాదేవి, డీసీపీయూ, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘బాలల హక్కుల పరిరక్షణతోనే బంగారు భవిష్యత్‌కు పునాది’
‘అర్హులు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు దరఖాస్తు చేసుకోవాలి’
భూ భారతి చట్టంపై న్యాయ విద్యార్థులకు ప్రత్యేక అవగాహన
Siraj | ఆ పేరు కారణంగానే సిరాజ్‌ను సెలెక్ట్ చేయలేదు..! దుమారం రేపుతున్న రాజకీయ విమర్శలు
DK Shivakumar | మాకే తాగడానికి నీళ్లు లేవు, మికేలా ఇస్తాం.. సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

