Sai Srinivas | తిరుమలలో నిశ్చితార్థం.. హైదరాబాద్‌లో గ్రాండ్ వెడ్డింగ్ .. బెల్లంకొండ వారింట పెళ్లి సందడి
Sai Srinivas | టాలీవుడ్లో మరో శుభవార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతున్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆయన వివాహ వార్తలకు ఇప్పుడు స్పష్టత లభించింది.
Sai Srinivas | టాలీవుడ్లో మరో శుభవార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయానికి సిద్ధమవుతున్నారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆయన వివాహ వార్తలకు ఇప్పుడు స్పష్టత లభించింది. తాజా సమాచారం ప్రకారం, సాయి శ్రీనివాస్ నిశ్చితార్థం ఈ నెల 5న పవిత్ర క్షేత్రమైన తిరుమలలో జరగనుంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నిశ్చితార్థంతో వివాహ కార్యక్రమాలకు అధికారికంగా శ్రీకారం చుడుతున్నారు.
నిశ్చితార్థం అనంతరం వివాహాన్ని ఈ నెల 29న హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. నగరంలోని వారి ప్రైవేట్ ఫామ్ హౌస్‌లో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ఇప్పటికే సాయి శ్రీనివాస్ తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఏర్పాట్లను ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇటీవలే సాయి శ్రీనివాస్ రోకా వేడుక కుటుంబ సభ్యుల మధ్య సాదాసీదాగా జరిగింది. ఆయనకు కాబోయే వధువు కావ్య రెడ్డి హైదరాబాద్‌కు చెందిన యువతి. సినీ పరిశ్రమతో ఆమెకు సంబంధం లేకపోయినా, ప్రముఖ న్యాయవాది కుటుంబానికి చెందినదిగా తెలుస్తోంది. కొంతకాలంగా వీరిద్దరూ పరిచయం పెంచుకుని ప్రేమలో ఉన్నారని, ఇప్పుడు ఇరువైపుల కుటుంబాల అంగీకారంతో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారని టాక్ వినిపిస్తోంది.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘అల్లుడు శీను’ సినిమాతో టాలీవుడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి, తర్వాత ‘జయ జానకి నాయక’, ‘రాక్షసుడు’ వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కమర్షియల్, యాక్షన్, థ్రిల్లర్ జానర్లలో నటుడిగా తన ప్రతిభను నిరూపించుకున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘హైందవ’, ‘టైసన్ నాయుడు’ వంటి పలు ప్రాజెక్టులు ఉన్నాయి. కెరీర్ పరంగా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవడం అభిమానులను ఆనందానికి గురి చేస్తోంది. ఈ వివాహ వేడుకలకు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో పాటు సినీ తారలు కూడా ఈ వేడుకల్లో పాల్గొననున్నారని టాక్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

