Monkey Skull | ఢిల్లీ ఎయిర్పోర్టులో కోతి పుర్రె కలకలం.. హైదరాబాదీ బ్యాగులో లభ్యం
Monkey Skull | ఢిల్లీ (Delhi) లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Indiragandhi International Airport) లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ (Hyderabad) కు విమానంలో బయలుదేరిన ఒక ప్రయాణికుడి బ్యాగేజీలో జంతువు పుర్రె లభించడం తీవ్ర కలకలం రేపింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
Monkey Skull : ఢిల్లీ (Delhi) లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (Indiragandhi International Airport) లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ (Hyderabad) కు విమానంలో బయలుదేరిన ఒక ప్రయాణికుడి బ్యాగేజీలో జంతువు పుర్రె లభించడం తీవ్ర కలకలం రేపింది. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. ఆగస్టు 10న విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బంది సాధారణ భద్రతా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో హైదరాబాద్ వెళ్లేందుకు సిద్ధమైన ఒక ప్రయాణికుడి బ్యాగును స్కానింగ్ చేయగా.. అందులో అనుమానాస్పద వస్తువులు కనిపించాయి.
బ్యాగును తెరిచి పరిశీలించగా లోపల ఒక పుర్రె, ఒక మంత్ర దండం వంటి వస్తువులు కనిపించాయి. దీనిపై సిబ్బంది ప్రయాణికుడిని ప్రశ్నించగా అది కోతి పుర్రె అని సమాధానమిచ్చాడు. వెంటనే స్పందించిన అధికారులు అతడి ప్రయాణాన్ని నిలిపివేసి, తదుపరి విచారణ నిమిత్తం స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనను వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భారత వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 ప్రకారం.. వన్యప్రాణులు, వాటి శరీర భాగాలు లేదా వాటితో తయారుచేసిన వస్తువులను కలిగి ఉండటం, రవాణా చేయడం తీవ్రమైన నేరం.
ప్రస్తుతం అధికారులు స్వాధీనం చేసుకున్న పుర్రె నిజంగా కోతిదేనా, కాదా అని నిర్ధారించాల్సి ఉంది. ఒకవేళ అది వన్యప్రాణిదే అయితే ఆ ప్రయాణికుడికి అది ఎలా లభించింది..? దాని మూలం ఏమిటి..? దానిని కలిగి ఉండేందుకు అతడికి ఏమైనా చట్టపరమైన అనుమతులు ఉన్నాయా..? అనే కోణంలో దర్యాప్తు చేయనున్నారు. అవసరమైతే పుర్రెను పరీక్షించేందుకు వన్యప్రాణి నిపుణులు లేదా శాస్త్రవేత్తల సహాయం తీసుకోనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

