Haryana | జర్మనీలో భారతీయ యువకుడి హత్య.. న్యాయం కావాలంటున్న బాధిత కుటుంబం
Haryana : జర్మనీలో భారతీయ యువకుడు హత్యకు గురయ్యాడు. ఉద్యోగ, ఉపాధి కోసం వెళ్లి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో రెండు రోజులక్రితం జరిగింది. మృతుడిని హరియాణా, కురుక్షేత్రలోని, మహదేవ్ మొహల్లాకు చెందిన విషు శర్మ (25)గా గుర్తించారు.
Haryana : జర్మనీలో భారతీయ యువకుడు హత్యకు గురయ్యాడు. ఉద్యోగ, ఉపాధి కోసం వెళ్లి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో రెండు రోజులక్రితం జరిగింది. మృతుడిని హరియాణా, కురుక్షేత్రలోని, మహదేవ్ మొహల్లాకు చెందిన విషు శర్మ (25)గా గుర్తించారు. అతడి కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విషు కొన్నేళ్లుగా ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం విదేశాల్లో ఉంటున్నాడు. నవంబర్ 2022లో అతడు మొదల పోర్చుగల్ వెళ్లాడు. ఈ సమయంలో అతడి కోసం తండ్రి ప్లాట్ అమ్మి, రూ.20 లక్షలు అందించాడు.
విషు.. పోర్చుగల్లో ఏడాది పని చేసిన తర్వాత ఫ్రాన్స్ వెళ్లాడు. అక్కడ ఆర్మీలో ఆరు నెలలపాటు మిలిటరీ శిక్షణ తీసుకున్నాడు. అనంతరం ఫ్రెంచ్ ఆర్మీలో దాదాపు ఏడాదిపాటు పని చేశాడు. ఆ తర్వాత జర్మనీ వెళ్లాడు. అక్కడ ఫ్రాంక్ఫర్ట్లో ఉంటూ, డెలివరీ సెక్టార్లో సూపర్ వైజర్గా పని చేస్తున్నాడు. దాదాపు ఏడాదిన్నర కాలంగా అతడు అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో విషు శర్మ మరణించినట్లు అతడి తల్లిదండ్రులకు జర్మనీలోనే ఉంటున్న విషు స్నేహితుడు గౌరవ్ ఉదయం పోన్ చేసి చెప్పాడు. అతడిని ఎవరో పొడిచి చంపినట్లు వెల్లడించాడు. అయితే, ఎవరు చంపారు.. ఎందుకు చంపారు వంటి వివరాల్ని పోలీసులు కూడా చెప్పలేదని గౌరవ్.. విషు తల్లిదండ్రులకు వివరించాడు. దీంతో వారు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
వారు చివరగా గత సోమవారం విషుతో మాట్లాడినట్లు చెప్పారు. ఆ తర్వాత రెండు రోజులకే అతడు మరణించినట్లు తెలిసిందన్నారు. అయితే, అక్కడి పోలీసుల నుంచి హత్యకు సంబంధించి ఎలాంటి వివరాలు తెలియరాలేదన్నారు. విషు ఎలా మరణించాడు.. ఎవరు, ఎందుకు హత్య చేశారో తమకు తెలియాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇదే సమయంలో అతడి మృతదేహాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కుటుంబ సభ్యులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

