ఎర్రుపాలెం, సెప్టెంబర్ 28 : పీఆర్టీయూ ఎర్రుపాలెం మండల నూతన కమిటీ (2026-29) ఏకగ్రీవంగా ఎన్నికైంది. సోమవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకుని ఆమోదించారు. మండల గౌరవ అధ్యక్షుడిగా జి.చిన్నప్ప, అధ్యక్షుడిగా బొగ్గుల మదనమోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మారపాక బాబురావు, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎన్.లూక్య, ఉపాధ్యక్షులుగా కె.రాఘవ, మహిళా అసోసియేట్ అధ్యక్షురాలిగా పి.నాగమణి, మహిళా ఉపాధ్యక్షురాలిగా వై.భవాని ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా వి.శ్రీనివాస్ రెడ్డి, ఆర్.రమేష్, ఎస్.కె.షాజహాన్, మహిళా కార్యకర్తలుగా ఎల్.రత్నశ్రీ, కనకదుర్గ, జిల్లా కౌన్సిలర్లుగా రమణయ్య, ఎస్.కె.రమేశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికకు జిల్లా పరిశీలకులుగా చి.రవికుమార్, కె.సత్యనారాయణరెడ్డి, పి.సుధాకర్ హాజరై ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో భాగంగా పీఆర్సీని వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల విద్యాధికారి మురళీమోహనరావు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి పాఠశాలలో విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు గురునాథరెడ్డి, జిల్లా బాధ్యులు సంగిరెడ్డి, నాగరాజు, మండల పీఆర్టీయూ నాయకులు, ఉపాధ్యాయులు నాగభూషణ్ రెడ్డి, సత్యనారాయణరెడ్డి, వెంకట్ నారాయణ, సాంబయ్య, శివకుమార్, గోపికృష్ణ, రేణుక, నరసింహారావు, రాధా, రుక్మిణి, గోపిరెడ్డి, యామిని, అప్పిరెడ్డి, ఎం.శ్రీనివాసరావు, రామారావు, వెంకటేశ్వర్లు, మధుసూదన్ రెడ్డి, పద్మజ, శ్రావణి, కీర్తి, అల్లు విజయ, నాగమణి, జయంతి, యశోద, వత్సలాదేవి, టి. వెంకటేశ్వరరావు, ఎల్. శ్రీనివాస్ రెడ్డి, ఫిలిప్పు, యమునా, నిహాలు, మేరీ, మంజు, అశోక్ రెడ్డి, ప్రభాకర్, డి. వెంకటేశ్వరరావు, లింగం, సతీష్, గుడిపూడి శ్రీనివాసరావు, బి.బి. రాజు, శ్రీలత, లింగయ్య, సుధారాణి పాల్గొన్నారు.