బూర్గంపహాడ్, సెప్టెంబర్ 28 : బూర్గంపహాడ్ మండల పరిధిలోని సారపాక 33కేవీ నూతన బ్రేకర్ ఏర్పాటు చేయాల్సి ఉండటంతో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ట్రాన్స్కో ఏఈ గుర్రం ఉపేందర్ సోమవారం తెలిపారు. ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు సారపాక, మోతే, ఇరవెండి గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని, వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.