– ఇంపాక్ట్ ఫౌండేషన్ సర్టిఫైడ్ ట్రైనర్ తుల్లుబెర్లు సునీత
బూర్గంపహాడ్, సెప్టెంబర్ 28 : విద్యార్థులు సత్ప్రవర్తన కలిగి ఉండటంతో పాటు భవిష్యత్ లక్ష్యాలు ఎలా సాధించాలనే దానిపై ఇంపాక్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం బూర్గంపహాడ్ మండల పరిధిలోని అంజనాపురం యూపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఇంపాక్ట్ ఫౌండేషన్ సర్టిఫైడ్ ట్రైనర్ తుల్లుబెర్లు సునీత విద్యార్థులకు పలు అంశాలను వివరించారు. తల్లిదండ్రులు, గురువులతో ఎలా మెలగాలి, విద్యలో సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని, అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి, శారీరిక ధృఢత్వం కోసం తీసుకోవాల్సిన చర్యలు, మెడిటేషన్ తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థులు చెడును వదిలి మంచివైపు పయనించినప్పుడే విజయాలు సాధ్యమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.